Take a fresh look at your lifestyle.

మరో ట్యాపింగ్ రావు.. ఎమ్మెల్సీ నవీన్ రావు

ఐఎఎస్, ఐపీఎస్ లపై కూడా నిఘా.. ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో బ్లాక్ మెయిలింగ్.. రెండు న్యూస్ ఛానెల్స్ లలో ఫోన్ ట్యాపింగ్ సమాచార కథనాలు.. సీఐ నుంచి ఐజీపీ వరకు ఇంటి ముందు క్యూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు

0 1,151

నవీన్ రావు కేరాప్ ఫోన్ ట్యాపింగ్

  • ఐఎఎస్, ఐపీఎస్ లపై కూడా నిఘా..
  • ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో బ్లాక్ మెయిలింగ్..
  • రెండు న్యూస్ ఛానెల్స్ లలో ఫోన్ ట్యాపింగ్ సమాచార కథనాలు..
  • సీఐ నుంచి ఐజీపీ వరకు ఇంటి ముందు క్యూ..
  • ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

ఫోన్ ట్యాపింగ్ కేరాప్ ఎమ్మెల్సీ నవీన్ రావు అలియాస్ కేసీఆర్ ఫ్యామిలీ కుటుంభీకుడు. ఆయన పేరుకే ఎమ్మెల్సీ .. అయినా.. ఆయన ముందు మంత్రులైనా డమ్మిలే.. కేసీఆర్ బంధువు అనే పేరుతో బీఆర్ ఎస్ ప్రభుత్వంలో నవీన్ రావు చేయని ఫైరావీ లేదు. సీఎం పేశి నుంచి కేసీఆర్ సెక్రటరీతో ఫోన్ చేయించి ఉన్నతాధికారులతో సైతం పనులు చేయించుకోవడంలో ఆయన దిట్ట. ఓ న్యూస్ ఛానెల్ సంస్థ యాజమాని శ్రవణ్ తో కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం నవీన్ రావు నడిపినట్లు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో సిట్ అధికారులు పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో …

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ బంధువు ఎమ్మెల్సీ నవీన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్ లతో పాటు ప్రత్యార్థి రాజకీయ ఫోన్ లను మాజీ పోలీసు అధికారి ప్రణీత్ రావు బృందంతో ట్యాప్ చేయించి తన పనులను చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని కేసీఆర్ కు అనుకూలంగా ఉండే రెండు న్యూస్ ఛానెల్స్ లలో కథనాలు ఇప్పించి పరోక్షకంగా బ్లాక్ మెయిల్ చేయడంలో ఇద్దరు క్రై రిపోర్టర్ లు కీలకంగా వ్యవహరించి కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ యాజమాని శ్రవణ్ కుమార్ మైండ్ గేమ్ తో నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ నడిపించినట్లు తెలుస్తోంది

ఐఎఎస్, ఎపీఎస్ లను వదులని నవీన్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఎఎస్, ఐపీఎస్ లు కూడా బాధితులయ్యారు. నవీన్ రావు సహాకారంతో మాజీ పోలీసు అధికారి ప్రణీత్ రావు బృందం ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రాస్, దివ్య ఫోన్ లను ట్యాపింగ్ చేశారు. అలాగే ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీప్ శివధర్ రెడ్డి ఫోన్ ను సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులకు విచారణలో తేలింది.

సీఎం పేశి నుంచి కేసీఆర్ సెక్రటరీతో ఫోన్..

సీఎం పేశి నుంచి కేసీఆర్ సెక్రటరీతో ఎమ్మెల్సీ నవీన్ రావు పోన్ లు చేయించి తమ పనులు చేయించుకునే వారు అనే టాక్ ఉంది. ఆ సెక్రటరీ ఫోన్ చేస్తే అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసినట్లుగా ఫీలైన ఉన్నతాధికారులు ఎలాంటి పనులనైనా వెంటనే చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫైరావీలు, అక్రమ భూదాందలతో సంపాదించిన ఆస్తులపై విచారణ చేస్తే ఎన్నో నిజాలు వెలుగు చూస్తాయంటున్నారు.

ఉద్యమంలో కనిపించని నవీన్ రావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నవీన్ రావు ఎక్కడా కనిపించలేరు. అయినా.. కేసీఆర్ బంధువు అనే కారణంతో ఎమ్మెల్సీ పదవి వెల్ కమ్ చెబుతూ ఆయన వద్దకు వచ్చింది. ఇగో.. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో నిజమైన తెలంగాణ ఉద్యమ కారులకు అన్యాయం జరిగింది. అలాగే కింది స్థాయి పోలీసు అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించిన తమ చెప్పు చేతిలో ఉంచుకోవడానికి ఉన్నతాధికారులకు లేని పోనివి చెప్పి వారి దృష్టిలో చెడ్డ వారిగా ముద్ర వేసి బదిలీ చేయించుకునే వారట. అయితే.. కష్టపడి పని చేసిన అధికారులు కంటికి కనిపించినా.. చెవికి వినిపించినా ఉన్నతాధికారులు నవీన్ రావు భయంకు నోరు మెదుపక పోయే వారని పోలీసు వర్గాలలో టాక్ ఉంది.

సుమోటోగా ఫోన్ ట్యాపింగ్ కేసు..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై విచారణ చేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు హైకోర్టులో సీల్డ్ కవర్ లో సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇగో.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఎవరెవరి పాత్ర ఉందో తప్పని సరి విచారణ అధికారులు హైకోర్టుకు నివేదికను సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు తెరపైకి వచ్చింది.

పాస్ పోర్టులు జప్తు కోసం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా సంస్థ యాజమాని శ్రవణ్ లు విదేశాలకు పారి పోయినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వాళ్లద్దరిని ఇండియా రప్పించడానికి కోర్టు అనుమతితో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ ఇద్దరి పాస్ పోర్టులను జప్తు చేయాలని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి లేఖ రాసినట్లు ఫోన్ ట్యాపింగ్ విచారణ అధికారులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు, శ్రవణ్ లను ఇండియాకు రప్పిస్తే పొలిటికల్ బాస్ ఎవరో తేలుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు..

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking