ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట
న్యూ డిల్లీ:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను సీబీఐ విచారణకు అనుమతివ్వడంపై పిటిషన్ దాఖలైంది. కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి లభించింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుపు న్యాయవాది నితీష్ రాణా మెన్షన్ చేశారు. దరఖాస్తును సీబీఐ అందించలేదని న్యాయవాది తెలిపారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఊరట దక్కలేదు. రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ విచారణపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత పిటిషన్ విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు స్వీకరించింది. దరఖాస్తును అందించలేదని చెప్పిన కవిత తరపు న్యాయవాది తెలిపారు. కవిత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం సీబీఐ సమయం కోరింది. ఏప్రిల్ 10న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.