కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర మంత్రుల భేటీ
శంషాబాద్, నిర్దేశం :
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీ వైష్ణవ్ తో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ ధన్సరి సితక్క పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీతరువాత కేంద్ర మంత్రి మహబూబ్ నగర్ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర మంత్రి తో సమావేశం తర్వాత మీడియా తో మంత్రులు మాట్లాడారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంమై చర్చించాం. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే జంక్షన్ కు మంత్రి సానుకూలంగా మాట్లాడారని అన్నారు.
వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేయడానికి రైల్వే మంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో మాతో కలిసి రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద మహానగరం వరంగల్ దాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారనిఅన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం శుభసూచకం. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు ఇప్పటికైనా మాతో కలసిరావాలని అన్నారు.
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి అనేక విషయాలపై చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రుల తోపాటు ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, చామాల కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.