12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్రపోతున్న వ్యక్తి.. అనేక లాభాలు ఉన్నాయ‌ట‌!

నిర్దేశం, హైద‌రాబాద్ః మనిషికి రోజుకు కచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర కావాలి. ఈ మాత్రం నిద్ర లేకపోతే ఆరోగ్యం చెడిపోక తప్పదు. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతాడు. 12 ఏళ్లుగా అతడిది ఇదే తంతు! నమ్మశక్యంగా లేని ఈ ఉదంతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఇంత తక్కువ సమయం నిద్రపోతున్నా తాను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, పనిలో ఉత్పాదకత కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు.

తన జీవితకాలాన్ని ‘రెట్టింపు’ చేసుకునేందుకు ఇలా తక్కువ సమయం నిద్రపోతున్నట్టు డాయిసుకీ హోరీ (40) చెప్పాడు. అతడిది జపాన్‌లోని హ్యూగో ప్రీఫెక్చర్. తక్కువ నిద్రతో కూడా నెట్టుకురాగలిగేలా తనకు తాను శిక్షణ ఇచ్చుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ‘‘తినే ముందు లేదా తిన్న తరువాత స్పోర్ట్స్ డ్రింక్ లేదా కాఫీ తాగితే నిద్ర మత్తు అస్సలు ఉండదు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

గంటల కొద్దీ నిద్రకంటే కొద్దిసేపైనా నాణ్యమైన నిద్ర తీస్తే ఆరోగ్యానికి అసలైన మేలు కలుగుతుందని వివరించాడు. దీంతో, ఏకాగ్రత కూడా పెరుగుతుందని అన్నాడు. ‘‘జీవితంలో లక్ష్యంపైనే దృష్టి పెట్టాలనుకునే వారు ఈ విధానంతో ఎక్కువ లాభపడతారు. ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రే ఉపయోగకరం. ఉదాహరణకు డాక్టర్లు, ఫైర్‌ఫైటర్లు తక్కువ సేపు నిద్రపోయినా వారి పని ఉత్పాదకత మాత్రం ఉత్కృష్టరీతిలో ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, అతడు చెబుతున్న విషయాల్లో నిజానిజాలను ఓ జపాన్ రియాలిటీ టీవీ షోలో తేలాయి. ఈ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు. కానీ, సుదీర్ఘనిద్ర తీసిన వ్యక్తిలా ఎంతో ఉత్సాహంగా తన పని ప్రారంభించాడు. జిమ్‌కు కూడా వెళ్లాడు’’ అని షో నిర్వాహకులు పేర్కొన్నారు.

తన విధానాన్ని జనాలకు నేర్పించేందుకు డాయిసుకీ.. జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రెయినింగ్ అసోసియేషన్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా అతడు తక్కువ నిద్రకు ఎలా అలవాటు పడాలో నేర్పిస్తున్నాడు.

ఇక వియత్నాంలో కూడా ఇదే తరహా ఉదంతం సంచలనం సృష్టించింది. థాయ్ ఎన్‌గాక్ అనే వ్యక్తి గత 60 ఏళ్లుగా నిద్రేపోలేదు. ఆయన వయసు 80 ఏళ్లు. 1962లో తనకు ఓసారి పెద్ద జ్వరం వచ్చిందని, ఆ తరువాత నుంచి తాను అసలు నిద్రేపోలేదని చెప్పుకొచ్చాడు. నిద్రలేమిని దూరం చేసుకునేందుకు రకరకాల థెరపీలు మందులు వాడినా కూడా ఫలితం లేకపోయిందని అన్నాడు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!