పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల భూమి కబ్జా..

మాజీ నక్సలైట్ అక్రమణలో 120 కోట్ల భూమి.. పేదల వద్ద కోట్లు వసూల్ చేసిన ఆ ఘనుడు..

0

పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల భూమి కబ్జా..

  • మాజీ నక్సలైట్ అక్రమణలో 120 కోట్ల భూమి..
  • పేదల వద్ద కోట్లు వసూల్ చేసిన ఆ ఘనుడు..
  • పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వాట
  • కబ్జా భూమి చుట్టూ రేకులతో ప్రహారి గోడ
  • సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా..

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

      సికింద్రాబాద్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో సుచిత్రకు దగ్గరలో జాతీయ రహదారి పక్కనే పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్.. దాని పక్కనే నెంబర్ 25/1, 25/2 లో జర్నలిస్టులకు 38 ఎకరాల భూమిని కేటాయించింది. ఇటీవలనే ఆ ల్యాండ్ ను జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సోసైటీకి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంద చేశారు. అయితే.. ఈ 38 ఎకరాలలో మాజీ నక్సలైట్, క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం సుమారు నాలుగు ఎకరాల సర్కార్ భూమిని అక్రమించుకున్నారు. అక్కడ ఎకరం ధర 30 కోట్లకు పైగానే..అంటే.. 120 కోట్ల ఆ భూమిని మాజీ నక్సలైట్, స్కూల్ యాజమాన్యం కబ్జా చేశారని ఇటీవల హైడ్రాకు జర్నలిస్టులు ఫిర్యాదులు చేశారు.

సర్కార్ అమ్ముతూ కోట్లు ఆర్జించిన మాజీ నక్సలైట్

ఔను.. మీరు చదివింది నిజమే.. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని ఓ పల్లెటూర్ కు చెందిన మాజీ నక్సలైట్ హైదరాబాద్ లో పంచాయితీల పేరుతో పబ్బం గడుపుకుంటూ కాలం వెళ్ల తీసేవాడు. లొంగిన ఆ నక్సలైట్ పోలీసులకు సహాకరిస్తున్నారని నక్సలైట్ లు ఆయనను హిట్ లిస్ట్ లో పెట్టారు. అంతేకాకుండా నక్సలైట్లతో ప్రాణపాయం ఉందని  ప్రభుత్వం నుంచి గన్ లైసెన్స్ తీసుకున్నారు. అయితే.. ఆ గన్ ను చూయించి భూములు కబ్జా చేసే ఆ లొంగిన నక్సలైట్ కన్ను పేట్ బషీరాబాద్  పోలీసు స్టేషన్ సమీపంలో గల జర్నలిస్టుల భూమిపై పడ్డది. ఒక ఎకరం ధర 30 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే ఆ ల్యాండ్ లో చాలా మంది పేదలకు 70 గజాలు చొప్పున విక్రయించి ఒక్కోక్కరి నుంచి పది లక్షలు తీసుకున్నాడనేది టాక్.

 కబ్జా ల్యాండ్ చుట్టూ సీసీ కెమెరాలు..

 ఆ మాజీ నక్సలైట్ డాన్ లా కొనసాగుతున్నాడు. తాను అక్రమించుకున్న ల్యాండ్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని దర్జాగా పేదల నుంచి కోట్లు వసూల్ చేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ నక్సలైట్ అక్రమణలో ఉన్న జర్నలిస్టుల ల్యాండ్ పై పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులకు లంచాలు ఇస్తూ పేదల పేరుతో కోట్ల ఆస్తులను అక్రమించుకున్నట్లు తెలుస్తోంది.

హెచ్ ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా..?

పేట్ బషీరాబాద్ ప్రాంతంలో మాజీ నక్సలైట్ కబ్జాలో ఉన్న సర్కార్ భూమి గురించి హెచ్ ఎండీఏ కమీషనర్ కు, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే.. తాము ఫిర్యాదు చేయగానే మాజీ నక్సలైట్ ను పిలిపించి డబ్బులు తీసుకుని తమనే పోలీసులు బెదిరిస్తున్నారంటున్నారు బాధితులు. హెచ్ ఎండీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులకు తాను మాజీ నక్సలైట్ మోసాలపై, భూకబ్జాపౌ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు ఆర్ ఎంపీ డాక్టర్ శ్రీనివాస్. తనకు మాయ మాటలు చెప్పిన మాజీ నక్సలైట్ ప్లాట్ ఇప్పిస్తానని 6 లక్షల 50 వేలు తీసుకుని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. నాలా వందలాది మందిని మోసం చేసిన మాజీ నక్సలైట్ పై చర్యలు తీసుకోవాలని ఆర్ ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 

సీఎం దృష్టికి జర్నలిస్టుల భూ కబ్జా వ్యవహరం..

జర్నలిస్టలు భూములను అక్రమించుకున్న మాజీ నక్సలైట్, క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యంపై జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని 38 ఎకరాలను జర్నలిస్టులకు అధికారికంగా పత్రాలను అంద చేశారు సీఎం. అయితే.. ఆ ల్యాండ్ లో ఇతరులు అక్రమించుకున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ అశోక్ రెడ్డి కోరారు.  

Leave A Reply

Your email address will not be published.

Breaking