Take a fresh look at your lifestyle.

కేసీఆర్ పాపం పండింది..

లోక్ సభ ఎన్నికలలో రిజల్ట్ గుండు సున్నా..

0 1,444

కేసీఆర్ పాపం పండింది

–       అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష హోదా..

–       లోక్ సభ ఎన్నికలలో గుండు సున్నా..

–       అహంకార పాలనతో దెబ్బ మీద దెబ్బ..

కేసీఆర్ పాపం పండింది. ఆయన అహంకార పదేళ్ల పాలనకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. ప్రతి పక్ష హోదాకు పరిమితం అయ్యింది. అయినా.. తాను చేసిన తప్పులను ఒప్పుకోలేక పోయారు. ఒప్పుకోవడానికి కేసీఆర్ కు అహంకారం అడ్డు వచ్చింది.

కేసీఆర్ అహంకారంపై రిజల్ట్ దెబ్బ..
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. పరువును కాపాడుకోవాలని బలవంతంగా కొందరిని ఒప్పించి పోటీలో దింపారు. లోక్ సభ ఎన్నికల్లో పన్నెండు సీట్లు గెలుస్తున్నామని కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ స్పీచ్ లతో దంచారు. బస్సు యాత్రలో మద్యం తాగుతూ బహిరంగ సభలతో ప్రజలలో జోష్ పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేసిండ్రని ప్రజలను నిందించారు. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రాజేయడానికి ప్రయత్నించారు. ఇగో.. ఈ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీకి తగిన బుద్ది చెప్పారు ప్రజలు. కేసీఆర్ అహంకారంపై జీరో రిజల్ట్ ఇస్తూ ప్రజలు తీర్పు చెప్పారు.

కేసీఆర్ ఫ్యామిలీని నమ్మని ప్రజలు..
ఔను.. కేసీఆర్ ఫ్యామిలీ మాయ మాటలను నమ్మలేరు జనం. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విసృతంగా ప్రచారం చేసి ఒకటి-రెండు ఎంపీ సీట్లు గెలిచి పరువు కాపాడుకోవాలని భావించారు. ముఖ్యంగా మెదక్, నాగర్ కర్నూల్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కేసీఆర్ ఫ్యామిలీకి కేంద్రంగా నిలిచిన మెదక్ లో ఎదురు గాలి వీచింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‭ నుంచి పోటీ చేసిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓడి పోయారు.

కేసీఆర్ ఫ్యామిలీని వెంటాడుతున్న క్రిమినల్ కేసులు..
కేసీఆర్ మాటకారి.. మాటలతో మాయ చేస్తారు. ఓడినా.. గెలిచినా తగ్గేదేలే అన్నట్లు ఉంటారు. పదేళ్ల కాలంలో ప్రజలను మాయ మాటలతో మభ్య పెడుతూ తెలంగాణ వాదులను దూరం పెట్టింది కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి కంపుతో కుళ్లి పోతున్న కేసీఆర్ ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలులో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను త్వరలో విచారించడానికి పోలీసు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కూడా కేసీఆర్ కు తెలిసీ జరిగిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీని క్రిమినల్ కేసులు వెంటాడుతున్నాయి. ఇక ముందు కూడా క్రిమినల్ కేసులు వెంటాడే అవకాశ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking