నిర్దేశం: 12 ఫెయిల్ సినిమా మీకందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో మనోజ్ కుమార్ శర్మ చాలా కష్టపడి సివిల్స్ సాధిస్తాడు. ఆ సినిమా ఎంతో మందికి ఇన్సిపిరేషన్ గా నిలిచింది. ఆ సినిమా మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని ఓ గ్రామం నుంచి వచ్చిన మనోజ్ జీవిత పోరాటం మాటల్లో చెప్పలేనిది. బహుశా అందుకేనేమో.. విధు వినోద్ చోప్రా ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించారు. అదే మనోజ్ కుమార్ శర్మ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ నియామక కమిటీ ఆయనను డీఐజీ నుంచి ఐజీగా ప్రమోషన్ ఇచ్చింది.
బాల్యం అత్యంత పేదరికంలో గడిచింది
ఈ రోజు ఐపీఎస్ మనోజ్ శర్మ ఒక ప్రసిద్ధ వ్యక్తిగా మారినప్పటికీ, ఆయనచాలా పేదరికంలో జీవించవలసి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో జన్మించిన మనోజ్ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆయన చదువుకునే రోజుల్లో పరీక్షలలో ఉత్తీర్ణత కోసం చీటింగ్ చేశారు. 10వ తరగతి పరీక్షలో థర్డ్ డివిజన్‌తో ఉత్తీర్ణత సాధించి, 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అయితే కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత పోరాటాల మధ్య ఆయన ఐపీఎస్ పూర్తి చేశారు.
రిక్షా ఆలోచనను మార్చేసింది
కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న మనోజ్, తన సోదరుడితో కలిసి ఆటో రిక్షా నడపారు. తద్వారా ఇంటి పరిస్థితి దిగజారింది. అయితే, ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆయన రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనపై మనోజ్ పోరాటానికి బదులు, డీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో డీఎం, ఎస్ డీఎం ప్రభావాన్ని చూసి, పరిపాలనా సేవల్లో చేరాలని తన మనస్సులో ఒక లక్ష్యం చేసుకున్నారు.
ప్యూన్ ఉద్యోగం వచ్చింది
మనోజ్ ఢిల్లీలో తన కలను నెరవేర్చుకునే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దేవాలయాల బయట భిక్షాటన చేస్తూ జీవనోపాధి పొందే వారితో మమేకం కావాల్సిన కాలం వచ్చింది. తన కుటుంబానికి సహాయం చేయడానికి, అతని విద్యను పూర్తి చేయడానికి ప్యూన్‌గా పనిచేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, మనోజ్ తన కల నెరవేరే వరకు సంకల్పాన్ని వదలలేదు. అదే ఆయనను చివరికి ఐపిఎస్‌గా నిలబెట్టింది.