ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అనకాపల్లి, నిర్దేశం:
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న (17) సృజన, గురువారం సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినప్పటి నుంచి డల్‌గా ఉంది. శుక్రవారం ఉదయం తండ్రి గ్రామంలో ఓ ఫంక్షన్‌కి వెళ్లి రాగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.