విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
– కాలేజీ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్టణం, నిర్దేశం
మధురవాడ పరదేశిపాలెం నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. చదువుపై ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలు:
ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్ర వంశీ (17), ఒడిశా రాష్ట్రంలోని రాయపూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి. చదువుపై సరైన దృష్టి పెట్టడం లేదని లెక్చరర్ మందలించడంతో, మనస్తాపానికి గురైన చంద్ర వంశీ, కళాశాల భవనంపై నుంచి దూకి తన ప్రాణాలను కోల్పోయాడు
ఆందోళన – ఉద్రిక్తత:
ఈ ఘటనపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యకర్తలు కళాశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో, పీఎంపాలెం పోలీసులు SFI నేతలను అదుపులోకి తీసుకున్నారు.