గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ లో చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తారు..

గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ లో

చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తారు..

–       వంద శాతం ప్లేస్ మెంట్..

–       క్రమశిక్షణకు ప్రధాన్యత..

–       కంప్యూటర్ లో ప్రత్యేక క్లాసులు..

గ్రేట్ ఇండియా.. ఈ పేరులోనే ఉట్టి పడుతుంది దేశభక్తి.. నిజమే.. 23 ఏళ్లు భారత దేశం కోసం సరిహద్దులలో విధులు నిర్వహించారు కొలోనెల్ శరత్ టిపిర్నేని  (వెటెరన్). విద్యతోనే దేశ అభివృద్ది సాధ్యమని నమ్మిన ఆయన మెరుగైన విద్యను అందించాలని 2012లో  హైదరాబాద్ లోని కొంపల్లిలో ‘‘గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్’’ను స్థాపించారు. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో ఈ డిగ్రీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెట్ కొలోనెల్ శరత్ టిపిర్నేని  క్రమశిక్షణకు అత్యంతా ప్రధాన్యత ఇస్తారు.  

 ఔను.. కార్పొరేట్ కాలేజ్ లలో ‘చదువు’ కొంటున్నారు.. కానీ..  సమాజంలోని రుగ్మాతలను రూపుమాపాలంటే ‘చదువు’తోనే సాధ్యమని గుర్తించారు కొలోనెల్ శరత్ టిపిర్నేని. విద్యలో వెనుక బడిన తెలంగాణలో ఆయన ‘‘గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్’’ పేరుతో విద్య బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారు. చదువు, సంస్కారంతో పాటు క్రీఢలకు ప్రధాన్యత ఇస్తూ లైఫ్ లో సెటిల్ కావడానికి మార్గదర్శకంగా నిలుస్తోంది గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్..

ఫీజులు తక్కువే..

గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ లో ఫీజులు తక్కువే. కార్పొరేట్ ప్రైమిరరీ స్కూల్ లలోని స్టూడెంట్స్ ఫీజులతో పోల్చితే కూడా ఈ డిగ్రీ కాలేజ్ లోని ఫీజులు ఇంకా తక్కువే. గ్రామీణ విద్యార్థులకు తక్కువ ఫీజులతో మెరుగైన విద్యను అందిస్తోంది కాలేజ్ యాజమాన్యం. ఫీజులు  తక్కువున్నాయంటే చదువు నాణ్యత ఉండదనుకుంటే పొరపాటే.

ఈ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నారంటే జీవితంలో సెటిల్ అయినట్లే. విద్యార్థుల మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు పర్సనల్ క్లాసులు ఇప్పించే ప్రిన్సిపల్ కోవెల శ్రీకాంత్ స్టూడెంట్స్ కు తండ్రిలా ప్రతిక్షణం వాళ్లపై నిఘా పెడుతారు. క్వాలిటి ఎడ్యుకేషన్ అందించడం తమ లక్ష్యం అంటారు ఆయన.

ప్రత్యేకతలు..

గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ లో బిబిఏ, బి.కాం(కంప్యూటర్), బి.ఎస్సీ. (ఎంఎస్ టీసిఎస్) కోర్సులలో విద్య బోధన చేస్తోంది యాజమాన్యం. ఈ డిగ్రీ కాలేజ్ లోని విద్యార్థులకు వంద శాతం ప్లేస్ మెంట్ లభిస్తోంది. క్రమశిక్షణతో విద్య బోధన చేసే అనుభవజ్ఞులైన లెక్చరర్ లు ఉండటం ఈ కాలేజ్ ప్రత్యేకత.

ప్రతి విద్యార్థికి కంప్యూటర్ ల్యాబ్ లో వెబ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూర్టీ, సీ లాంగ్వేజ్, జావా నేర్పిస్తారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, స్కాలర్ షీప్ స్పెషాలిటీ, పరిశ్రమల సందర్శన, గెస్ట్ లెక్చరర్స్ తో ప్రత్యేక క్లాసులు ఇలా ఎన్నో గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ లో ఉన్నాయి.

–       యాటకర్ల మల్లేష్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!