మీ ప్రమేయం లేకపోయినా ట్రాఫిక్ చలానా పడిందా? జరిమానా నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేయండి

నిర్దేశం: పుట్టినవాడు గిట్టక తప్పదని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. దీన్నే ట్రాఫిక్ పోలీసుల భాషలో చెప్పాలంటే.. బండి నడిపేవాడికి ట్రాఫిక్ చలాన్ పడక తప్పదు అనాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చలాన్ పడుతుంది, అది వేరే విషయం. కానీ, బండి బయటికి తియ్యకపోయినా చలాన్ పడుతుంది. టెక్నాలజీ తప్పిదమో, ట్రాఫిక్ పోలీసుల తప్పిదమో కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఇలా జరిగితే చాలా మంది చలాన్ చెల్లిస్తారు. అంతకు మించి చేసేదేముంటుందని అనుకుంటారు. కానీ, ఉంటుంది. మీకు సంబంధం లేకుండా చలాన్లు పడితే కట్టనక్కర్లేదు. జరిమానాల నుంచి కాపాడుకునేందుకు మంచి పరిష్కార మార్గం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

లోక్ అదాలత్ గురించి అందిరికి తెలుసుగా.. దాని ద్వారా మీరు చలాన్‌ను రద్దు చేయవచ్చు. పెండింగ్ లేదా పాత కేసులు, వివాదాలు లోక్ అదాలత్ లో పరిష్కారమవుతాయి. తాజాగా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ లోక్ అదాలత్ తేదీలను ప్రకటించింది. మూడవ జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14న నిర్వహిస్తారు. దీనిలో మీరు ట్రాఫిక్ చలాన్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి లోక్ అదాలత్‌ను సంప్రదించవచ్చు. అయితే దీని కోసం మీరు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.

అన్ని పత్రాలను సమర్పించండి: మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ట్రాఫిక్ చలాన్‌కు సంబంధించి అవసరమైన అన్ని చట్టపరమైన పత్రాలను సమర్పించాలి. ఏదైనా ఉల్లంఘనకు సంబంధించి ఏవైనా నోటీసులు లేదా కమ్యూనికేషన్‌లను కూడా చేర్చండి.

హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి: లోక్ అదాలత్‌ల కోసం హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో ట్రాఫిక్ హెల్ప్ డెస్క్‌లు కూడా ఉన్నాయి. ఈ హెల్ప్ డెస్క్‌లు మీ కేసును కోర్టులో ఎలా సమర్పించాలనే దానిపై మీకు మార్గనిర్దేశం చేస్తాయి.

కేసు నమోదు: లోక్ అదాలత్‌లో కేసును సమర్పించడానికి, మీరు మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. మీ వాహనంపై జారీ చేసిన పెండింగ్ చలాన్ వివరాలను తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి: ఇప్పుడు మీ తదుపరి దశ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం. అపాయింట్‌మెంట్ ప్రకారం మాత్రమే మీరు లోక్ అదాలత్‌కు వెళ్లవచ్చు. అపాయింట్‌మెంట్ ప్రకారం, మీరు షెడ్యూల్ చేసిన తేదీలో లోక్ అదాలత్‌లో హాజరు కావాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!