డిమాండ్లు అంగీకరించకపోతే మారణహోమమే
– పాకిస్తాన్ కు బలోచిస్థాన్ లబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) రెబల్స్ హెచ్చరికలు
నిర్దేశం, బలోచిస్తాన్ః
పాకిస్థాన్‌లో మంగళవారం రైళును హైజాక్ చేసిన ఘటన సంచలనంగా మారింది. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని బలోచిస్థాన్ లబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) రెబల్స్ హైజాక్ చేసింది. తమ డిమాండ్లు అంగీకరించకపోతే.. మారణహోమం తప్పదంటూ.. హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాజాగా 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు బలోచిస్థాన్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసిందని.. ప్రభుత్వం స్పందించకపోవడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో బందీలుగా తీసుకున్న 214 మంది సైనికులను చంపేసినట్లు బిఎల్‌ఎ ప్రకటనలో పేర్కొంది. దీంతో తమ ఆపరేషన్ ముగిసిందని.. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే తమ చేతులకు పని చెప్పాల్సి వచ్చిందని చెప్పకొచ్చింది.