పిల్లలు ఫారిన్ లో సెటిలైతే కుక్కే కూతురైంది
అమెరికాలో వరుణ్.. కెనడాలో వర్షిత్..
అతను సివిల్ ఇంజనీర్.. ఆమె విద్యార్థులకు విద్యా బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. వాళ్లిద్దరు భార్య భర్తలు వసంత లక్ష్మీ, వాసుదేవరావు. ‘‘మేము ఇద్దరం.. మాకు ఇద్దరు..’’ అంటూ సంతోషంగా చెబుతారు ఆ దంపతులు. పెద్ద కుమారుడు వరుణ్ పోస్ట్ గ్రాడ్యువేషన్ కోసం అమెరికా వెళ్లాడు. చిన్న కుమారుడు వర్సిత్ కెనడాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. చదువు పూర్తి కాగానే ఆ ఇద్దరు కూడా అక్కడే మంచి జాబ్ లో సెటిలయ్యారు.
ఇద్దరు పిల్లలు ఫారిన్ లోనే..
చేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచమే చిన్నదైంది. ప్రపంచంలో మనోళ్లు ఎక్కడున్న ప్రతి రోజు మాట్లాడుకునే అవకాశం కమ్యూనికేషన్ వ్యవస్థ ఇచ్చింది. ఇగో.. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన దంపతులు వసంతలక్ష్మీ, వాసుదేవరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ ప్రాంతంలో గల అనూష్ అపార్ట్ మెంట్ లో ఉంటారు. ఫారిన్ లో ఉన్న తమ పిల్లలను చూడాలనిపించినప్పుడు ఆ దంపతులు అమెరికాలో సెటిలైన వరుణ్ వద్దకు, కెనడాలో ఉంటున్న వర్సిత్ ల వద్దకు ఏడాదికోసారి వెళ్లి వస్తుంటారు.
పెంపుడు కుక్కే కూతురైంది..
లోలా అంటే… వసంతలక్ష్మీ, వాసుదేవరావు దంపతులకు ప్రాణం. ఆ లోలాతో వాళ్లుంటే ఫారిన్ లో ఉన్న ఇద్దరు పిల్లలను కూడా మరిచి పోతుంటారు. ఇంతకు లోలా అంటే పెంపుడు ఆడ కుక్క. అరుదైన జాతీకి చెందిన ఈ (అతి చిన్నది) లోలా డాగ్ మెక్సికో బిడ్. వాసుదేవరావు కో – బ్రదర్ డాటర్ డాక్టర్ భాస్విణి (బెంగుళూర్) చైనా నుంచి సుహ్వవా (అరుదైన జాతీ కుక్క పిల్ల)ను తీసుకు వచ్చింది. పిల్లలు ఫారిన్ లో సెటిల్ కావడంతో ఒంటరిగా ఫీలవుతున్న వసంతలక్ష్మీ, వాసుదేవరావులకు అతి పొట్టిగా ఉండే సుహ్వవా కుక్కను గిఫ్ట్ గా ఇచ్చింది డాక్టర్ భాస్విణి. ఆ కుక్క పిల్లకు ‘‘లోలా’’ అనే పేరు పెట్టి సొంత కూతురిలా భావిస్తున్నారు.
లోలా అతి తెలివైనది..
వసంతలక్ష్మీ, వాసుదేవరావు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగ రీత్యా బిజీగా ఉంటారు. పొద్దంతా జాబ్ చేయడానికి బయటకు వెళ్లాల్సిందే. ఆ సమయంలో తమ పెంపుడు కుక్క లోలాను ఇంట్లోనే వదిలి డ్యూటీకి వెళుతారు. కానీ.. డ్యూటీకి వెళ్లిన వాళ్లిద్దరి మనసు లోలా పైనే.
ఇంటికి రాగానే లోలాను చూడగానే తమ టెన్షన్ పోతుందంటారు వాసుదేవరావు. లోలా డాగ్ తమతో ఉంటే ఈ ప్రపంచాన్ని మరిచి పోతున్నమంటారు ఆయన. డ్యూటీకి వెళ్లిన సమయంలో లోలా(డాగ్)కు బోజనం, నీళ్లు ఏర్పాటు చేసి వెళుతామన్నారు వాసుదేవరావు. లోలా చాలా తెలివైనది.. ప్రతి రోజు లోలాను వాకింగ్ కు తీసుకెళ్లక పోతే అలుగుతుందంటున్నారు ఆయన.
యాటకర్ల మల్లేష్