బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను సింగర్ మంగ్లీ ఖండించారు.
ఫోటోలు మరియు వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా, ఈవెంట్ భారీ విజయాన్ని సాధించిందన్నారు ఆమె.
ఉత్తమ ఈవెంట్‌లలో ఇదొకటని అమె పేర్కొన్నారు. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతు అపారమైనది.
ఈవెంట్ లో నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇది మాటలలో వర్ణించలేనిదన్నారు మంగ్లీ.
ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి కొందరు చేస్తున్నారన్నారు ఆమె.