ఆ ఇంట్లో హిందూ – క్రిస్టియన్ మతాలు
– ఇంటి పెద్ద మరణిస్తే అంత్యక్రియలు..?
నిర్దేశం, నిజామాబాద్ :
ఔను.. ఆ ఇంట్లో హిందూ – క్రిస్టియన్ మతాల మధ్య ఇంటి పెద్ద మరణిస్తే ఏ మతంతో అంత్యక్రియలు నిర్వహించాలనేది ప్రశ్న..? మొదటి నుంచి ఆ కుటుంబీకులంతా హిందువులే.. కానీ.. పరిసర ప్రాంతాలలో క్రిస్టియన్స్ ఉండటంతో ఆ ప్రభావం ఆ కుటుంబంపై పడ్డది. అంతే.. ఆ కుటుంబం క్రిస్టియన్ మతం స్వీకరించింది. ఆ తరువాత ఏమి జరిగిందంటే.. ఈ రియల్ స్టోరి చదువాల్సిందే..
నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన గంగారం కుటుంబం గత ముప్పై ఏళ్లుగా నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో క్రిస్టియన్ కాలోనిలో ఉంటున్నారు. అయితే.. ఆ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ప్రభావం ఆ కుటుంబంపై పడ్డది. అంతే.. హిందు మతానికి గుడ్ బై చెప్పి క్రిస్టియన్ మతం స్వీకరించింది ఆ కుటుంబం.