- కాకపుట్టిస్తున్న ఎగ్జిట్ పోల్స్.. ఈసారి కేంద్రంలో అధికారం ఎవరిదంటే?
ఒపీనియన్ పోల్సే మళ్లీ రివర్స్
ముందస్తు అంచనాలనే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్
మళ్లీ బీజేపీకే పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు
కనీసం సీట్లు కూడా అందుకోని ఇండీ కూటమి
ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయో అటుఇటుగా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. మళ్లీ ఎన్డీయేదే అధికారమని, భారతీయ జనతా పార్టీ సింగిల్ గా మెజారిటీకి సరిపడా సీట్లు సాధిస్తుందని చెప్పాయి. ముచ్చటగా మూడోసారి 300 సీట్లకు పైగా కాషాయ కూటమి గెలుస్తుందని, కేంద్రంలో అధికారం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. రెండు సర్వే సంస్థలు ఎన్డీయే 350 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. 13 సర్వే సంస్థలు ఎన్డీయే 300 పైగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి 100-120 సీట్లకే పరిమితం అయిపోతుందని అంచనా వేశాయి.
ఇండియా న్యూస్-డి-డైనమిక్స్: ఎన్డీయే-371, ఇండి కూటమి: 125, ఇతరులు-47
జన్ కీ బాత్: ఎన్డీయే 362-392, ఇండి కూటమి 141-161, ఇతరులు-10-20
రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్: ఎన్డీయే-353-368, ఇండి కూటమి-118-133, ఇతరులు 43-48
రిపబ్లిక్ TV-P MARQ: ఎన్డీయే 359, ఇండి కూటమి-154, ఇతరులు-30
లోక్ పోల్స్: ఎన్డీయే 325-335, ఇండి కూటమి 155-165, ఇతరులు 48-55
న్యూస్ నేషన్: ఎన్డీయే 342-378, ఇండి కూటమి 153-169, ఇతరులు 21-23
ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్: ఎన్డీయే 365, ఇండి కూటమి 146, ఇతరులు 36
ఎన్నికల తుధి ఫలితాల్ని కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 4న విడుదల చేయనుంది.