శృంగారంలో ఈ పొర‌పాట్లు అస్స‌లు చేయ‌కండి

నిర్దేశం, హైద‌రాబాద్ః శృంగారం గురించి ఆస్వాధించ‌డం గురించి సృష్టిలో ఏ జీవికీ చెప్ప‌న‌క్క‌ర్లేదేమో! అత్యంత స‌హ‌జ‌మైన ఈ ప్ర‌క్రియ గురించి ఎవ్వ‌రికీ కొత్త‌గా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. అయితే నాగ‌రిక‌త వ‌ల్ల‌, స‌మాజంలో క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాలు, చ‌ట్టాలు, శ‌తాబ్దాలుగా కొన‌సాగుతున్న అభిప్రాయాలు.. వీట‌న్నింటి ఫ‌లితంగా శృంగారంపై చ‌ర్చ కూడా మ‌నిషికి అవ‌స‌ర‌మైందిగా మారింది. వాతావ‌ర‌ణంలో మార్పు, బిడియం, అపోహ‌లు.. ఇవ‌న్నీ భార్య‌భ‌ర్త‌లైన వారి మ‌ధ్య కూడా శృంగారం విష‌యంలో ప‌ర‌స్ప‌ర అవగాహ‌న లేక‌పోవ‌చ్చు.

ఈ విష‌యంలో లింగ‌బేధాలు ఉండ‌వు. తాము విన్న‌ది, తెలుసుకున్న‌ది, అనుకుంటున్న‌దాని ప్ర‌కారం వారు ప్ర‌వ‌ర్తించ‌వ‌చ్చు. దీని వ‌ల్ల బేధాభిప్రాయాలు పెరిగే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంటంటే.. పార్ట్ న‌ర్ తో ఓపెన్ గా డిస్క‌స్ చేసుకోవ‌డ‌మే అంటున్నారు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్. ఇదే స‌మ‌యంలో శృంగారంలో చేయ‌కూడ‌ని పొర‌పాట్ల గురించి కూడా వారు ఒకింత వివ‌ర‌ణ ఇస్తున్నారు.

ఇష్టాయిష్టాల‌ను చెప్ప‌క‌పోవ‌డం

శృంగారం విష‌యంలో ప‌ర‌స్ప‌రం ఇష్టాయిష్టాల‌ను చెప్ప‌క‌పోవ‌డం అతి పెద్ద పొర‌పాటు. బ‌హుశా సామాజిక ప‌రిస్థితుల దృష్ట్యా మ‌గ‌వారు త‌న ఇష్టాన్ని చెప్పుకుంటారేమో కానీ, ఆగ‌వారు చెప్పుకోలేక‌పోవ‌చ్చు. అది భ‌ర్త‌తో కూడా! ఇలా చెప్పుకోక‌పోవ‌డ‌మే అతి పెద్ద పొర‌పాటని నిపుణులు చెబుతున్నారు. ఇష్టాయిష్టాల గురించి ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవ‌డం, ఒక‌టికి రెండు మూడు సార్లు అయినా ఈ విష‌యంలో పర‌స్ప‌రం స్ప‌ష్ట‌త‌ను ఇచ్చుకోవ‌డం చాలా మంచిద‌ని సూచిస్తున్నారు.

చొర‌వ చూప‌క‌పోవ‌డం

ఇది స్త్రీల విష‌యంలో ఉన్న కంప్లైంట్. బెడ్ రూమ్ యాక్టివిటీ మీద ప్ర‌ధానంగా మ‌గ‌వారే చొర‌వ చూపాల‌నే త‌త్వం ఉంటుంది చాలా మంది ఆడ‌వారిలో. ఇదంత తెలివైన అభిప్రాయం కాదు. ప్ర‌తీసారీ త‌నే చొర‌వ చూపడం మ‌గ‌వారికి కూడా ఒకింత బోర్ కొట్ట‌వ‌చ్చు. ఆడ‌వారు కూడా చొర‌వ చూపుతే శృంగారంలో మ‌జాను ప‌ర‌స్ప‌రం ఆస్వాధించ‌డానికి చాలా ఉప‌యుక్తంగా ఉంటుంది. ఆడ‌వారు మ‌రీ ద‌ద్దిలా ఉండ‌టం మ‌గ‌వారికి విసుగు తెప్పిస్తుంది కూడా.

అందం గురించి ఎక్కువ ఆలోచించ‌డం

అందం విష‌యంలో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు ఉంటాయి. తాము అందంగా ఉండ‌టం, లేక‌పోవ‌డం విష‌యంలో భిన్న‌ అభిప్రాయాలు డ్యామినేట్ చేస్తుంటాయి. తాము అందంగా లేమ‌నే ఒకింత ఆత్మ‌న్యూన‌త భావంతో శృంగారం విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌డం, లేదా అందం అంశం ఎక్కువ‌గా డ్యామినేట్ చేస్తూ శృంగారం విష‌యంలో ఏ భ‌యాన్నో, ఆందోళ‌న‌నో పెంపొందించుకోవ‌డం అంత ఆరోగ్య‌క‌రం కాదు. శృంగారం కేవ‌లం అందంతో ప‌ని కాదు, వైవాహిక బంధంలో అది స్ప‌ర్శ‌తో కూడిన బంధం అని గుర్తుంచుకోవాలి.

ఓవ‌ర్ థింకింగ్

శృంగారంలో క‌రెక్టుగా చేస్తున్నామా లేదా.. అనే ఓవ‌ర్ థింకింగ్ అంత మంచిది కాదు. న్యాచుర‌ల్ గా జ‌రిగిపోవ‌డం నేర‌మేమీ కాదు.

బీస్ట్ లా ఉండొచ్చు

శృంగారం విష‌యంలో ఎరోటిక్ గా, బీస్ట్ లా ఉండ‌టం ఏదో పెద్ద త‌ప్పు అనే భావ‌న కూడా పొర‌పాటే. ఆడ‌వారికి అయినా మ‌గ‌వారికి అయినా బీస్ట్ లా రెచ్చిపోవ‌డం సమంజ‌మైన అంశ‌మే. వైల్డ్ గా ఉండ‌టం నొచ్చుకోవాల్సిన అంశం ఏమీ కాదు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!