కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లేనా…

  • – ఎమ్మల్సీ జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ అనుమానమే
  • – కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ.. టికెట్ ఎవరికో..?
  • – టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా..?

త్వరలో ఖాళీ కాబోతున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. మూడుకి మూడు స్థానాలు గెలుచుకుని శాసనమండలిలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తుంది. సమర్ధులైన అభ్యర్ధులను లిస్ట్ అవుట్ చేసి హైకమాండ్ ఆమోదం కోసం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఆశవహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారంట.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి.. మాట ప్రకారం 53 వేల పైగా ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చింది. దీంతో నిరుద్యోగ వర్గం తమకు మద్దతుగా నిలబడుతుందని అంచనా వేస్తోంది హస్తం పార్టీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక దగ్గర పడుతుంది. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన రేవంత్ రెడ్డి సర్కారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఈజీ గా గెలుస్తామన్న ధీమాతో కనిపిస్తుంది.

ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు రెండు టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 31 నాటికి ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ ఇప్పటికే మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఇప్పటికే సేకరిస్తుంది. రాష్ట్ర అధినాయకత్వం ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సమీక్ష సమావేశాలు సైతం పూర్తి చేశారు. ఈ వారంలో అభ్యర్థుల ఎంపిక కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఆ సారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు.

పోటీ ఎక్కువే.. టికెట్ ఎవరికో..?

ఆ క్రమంలో కొత్త అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్యాసంస్థలు యజమానులు కాంగ్రెస్ నుండి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణా రెడ్డి, అల్ఫోస్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన మధనం గంగాధర్ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లాకు చెందిన గంగాధర్ తనకు టిక్కెట్ ఇస్తే బహుజనుల మద్దతుతో గెలిసి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ముఖ్య నేతలను కలిసి టికెట్ కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
అలాగే ఏమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి గాంధీ భవన్లో ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌ని కలిశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాలను కలసి తన బయో డేటాను సమర్పించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యే లు ఎంపీ లను కలసి మద్దతు కోరతానంటున్నారు. అయితే.. ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణా రెడ్డి, అల్ఫోస్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి, డీఎస్పీ గంగాధర్ పట్టభద్రుల టికెట్ కోసం పోటీ పడుతున్నప్పటికీ సామాజిక సమీకరణలతో డీఎస్పీ గంగాధర్ కు కాంగ్రెస్ టికెెట్ ఇస్తే రాహుల్ గాంధీ బహుజన సమీకరణకు న్యాయం చేసినట్లు అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ..?

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా..? మద్దతు ఇవ్వాలా అనే దానిపై చర్చ నడుస్తుంది ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజక వర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజక వర్గం లో కమ్యూనిస్టుల అభ్యర్థిగా నర్సి రెడ్డి తిరిగి బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కామ్రెడ్లను కలుపుకుని పోయిన కాంగ్రెస్.. ఈ సారి అక్కడ వారికి మద్దతిస్తుందంటున్నారు.

ఇక రెండో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం.. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం రఘోత్తమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సీనియర్ నేతలు.. జిల్లా మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని పీసీసీ ప్రెసిడెంట్ భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. ఆ నియోజక వర్గం లో పార్టీ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలి ప్రాధాన్యతగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ గెలిచి తీరతామన్న ధీమా పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతుంది.

(ఈదుల్ల మల్లయ్య)

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »