నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ పాలన 8 నెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వం ఇంకా మహాలక్ష్మి వద్దే ప్రభుత్వం ఆగిపోయింది. ఈరోజు భట్టి విక్రమార్క ప్రసంగం ఇది మరోసారి రుజువు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మినహా మరే గ్యారెంటీ అమలు అయినట్లు భట్టి చెప్పలేదు. వాస్తవానికి ప్రభుత్వం చెప్పినట్లు కనీసం మహాలక్ష్మి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందులో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు, రెండోది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మూడోది మహిళలకు నెల నెలా ఆర్థిక చేయూత. ఇందులో బస్సు మాత్రమే అమలైంది. కానీ, ప్రభుత్వం మహాలక్ష్మీ పేరుతో ప్రచారం చేస్తోంది.
గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలు గురించి ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. గ్యారెంటీల గురించి అడపాదడపా ప్రస్తావించినప్పటికీ.. తూతూ మంత్రంగానే చదివి దాటవేశారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు బాగానే చేశారు. కానీ, ప్రణాళికలేంటని స్పష్టం చేయలేదు. మౌళిక రంగానికే పూర్తిగా పడకేసినట్లే కనిపిస్తోంది.