మేధావులు ఆలోచన చేస్తే..?
ఈ సమాజమే మారుతుంది.
ఒక మేధావి ఆలోచన ఉద్యమానికి స్పూర్తిగా నిలుస్తోంది. ఒక మేధావి ఆలోచన సమాజాన్ని మార్చడానికి ప్రొత్సహిస్తోంది.
ఒక మేధావి ఆలోచన బడుగు, బలహీన వర్గాల జీవితాలను మారుస్తోంది.
గమ్యం చేరుకోవాలంటే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది.
ఎదురు లేదని విర్రవీగిన నియంతాలు కూడా తల వంచక తప్పని పరిస్థితి.
ఇదంతా చరిత్ర చెబుతున్న సత్యం. ఈ నిజాలను ఎవరు కూడా కాదానలేరు.
ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా మేధావులు ఒక్కోక్కరు ప్రజాక్షేత్రంకు వచ్చేస్తున్నారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేమాని భావించి పాలకులుగా ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకుంటున్నారు. సామాన్యుడి బతుకు గురించి మేధావులు మాత్రమే నిస్వార్థంగా ఆలోచన చేస్తారనే చర్చా ఇప్పుడు తెరపైకి వచ్చేసింది.
ఐపిఎస్ కు రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
ఇప్పుడు ఈ కోవాలోకి వచ్చిన వారే ఐపిఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్. అణచబడ్డ వర్గాల నుంచి వచ్చిన అతను వారి అభ్యున్నతి కోసం ఐపిఎస్ కు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు. ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్న బూర్జువ వర్గాలకు భిన్నంగా తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళుతున్నారు డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇటీవల పేపర్ లీకేజ్ సమస్యపై పోరాటం చేసి యువత హృదయాలలో డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ చోటు సంపాదించుకున్నారు. పేపర్ లీకేజ్ వల్ల ప్రతిభ గల విద్యావంతులకు అన్యాయం జరిగిందని 48 గంటలలో ఇప్పటి వరకు రాసిన పరీక్షాలను రద్దు చేయాలని అల్టీ మేటం ఇచ్చారు ఆయన. ఆ అల్టిమేటంకు ప్రభుత్వం దిగి రాక పోతే ఆమరణ నిరహర దీక్షకు దిగారు. అంతే ప్రభుత్వం తల వంచింది. పేపర్ లీకేజ్ జరిగినట్లు అంగీకరించింది. పరీక్షాలన్నిటినీ రద్దు చేసింది. నష్ట పోయిన నిరుద్యోగ యువతకు భరోసాగా నిలుస్తూనే తన రాజకీయ ప్రస్థానంను ముందుకు తీసుకెళుతున్నారు డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.
మారుతున్న రాజకీయాలలో బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఏమి ఆలోచన చేయచ్చు అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ ప్రశ్నలన్నీ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానంతో ముడి పడి ఉన్నాయి.
ఒక ఐడియా జీవితాన్ని మారుస్తోంది.
కానీ.. ఒక మేధావి నిస్వార్థంగా ఆలోచన చేస్తే సమాజమే మారుతుంది అంటారు విద్యావంతులు. కుళ్లి పోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఐపిఎస్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలిసిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ఆలోచన చేస్తే బడుగు, బలహీన వర్గాల జీవితాలలో వెలుగు వస్తోంది. కదూ..
——
మనం ఆలోచన చేద్దాం..
1.పోలీస్ ఆఫీసర్ పోలిటిషిన్ అయి పేపర్ లీకేజీ మీద ప్రెస్ మీట్ పెడితే ఎట్లా ఉంటుంది..?1
- ఒక ఇన్వెస్టిగేషన్ పోలీసు ఆఫీసర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎంక్వరీ చేసి రిపోర్టు ఇస్తే ఎలా ఉంటుంది..?
- ఒక రిక్రూట్మెంట్ బోర్డుకు ఛైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఇంకో బోర్డు ఛైర్మన్ చేసిన స్కామ్ ని వెలికి తీస్తే ఎలా ఉంటుంది..?
- లక్షల మంది స్టూడెంట్స్ కు తండ్రిగా భాద్యతలు నిర్వహించిన వ్యక్తి ఆ స్టూడెంట్స్ పరీక్షలకు అప్లై చేస్తే తన బిడ్డలకు అన్యాయం జరిగినపుడు తండ్రి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది?
- నిరుద్యోగిగా కారు షెడ్లో షెల్టర్ పొంది కష్టపడి చదివి IPS అయిన వ్యక్తి అదే నిరుద్యోగులు దోపిడి కి గురైతే నిందితులను పట్టుకుని వేటాడితే ఎట్లా ఉంటుంది..?
- రాజకీయం చేస్తున్నారని చెంచాలు అంటే నిజనిజాలు నిగ్గుతేల్చి డిబెట్ కు రమ్మని సవాల్ విసిరితే ఎట్లా ఉంటుంది..?
- ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించని ఈ సమాజంలో నుండి బుల్లెట్ లాంటి నాయకుడు గ్రౌండ్ లో దిగి ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుంది..? ఎప్పుడు ఎవరి గుండెల్లో దిగుతుందో అర్దం కాక సగం చచ్చి ఉంటారు కదా..
- అడ్డు అదుపు లేకుండా భీభత్సంగా కుంభకోణాలు చేసిన దొరలకు పవర్ స్టేషన్ అడ్డంగా నిలబడితే ఎట్లా ఉంటుంది..? దాటుకొని రాగలరా..?
- ఇంత వివరంగా రిపోర్టు ఇచ్చాక సిట్ కు పనేముంది? సార్ రిపోర్టును కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు గదా.
- సామాన్యుడు న్యూస్ పేపర్ కొన్నట్లు, డబ్బున్న వాడు ఎగ్జామ్ పేపర్ కొంటే ఈ చేతకాని ప్రభుత్వాన్ని దించడానికి చావుకు సిద్దపడ్ట నాయకుడు మళ్లీ సకల జనుల సమ్మేకు సైరన్ మోగిస్తే ఎట్లా ఉంటుంది..?
——
ఔను నిజమే.. ఈ పది ఫాయింట్ల గురించి ఆలోచన చేయాల్సి ఉంది. సమాజంలో ఐదు శాతం లేనోడు పాలన చేస్తూ అక్రమాలకు పాల్పాడి ఆస్తులు సంపాదిస్తున్న దోపీడి పాలకులను నిలదీసే సమయం వచ్చేసింది. ప్రజలను ఉద్యమానికి సిద్దం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.. మేధావుల్లారా.. కళ్లు తెరువండి. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలను చైతన్య వంతులను చేద్దాం రండి.
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్