నిర్దేశం, హైదరాబాద్ః నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న 7వ క్లాస్ చదువుతున్న లోహిత్ రెడ్డికి న్యాయం చేయాలంటూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఎస్ఐని కలిసి దీనిపై సత్వర విచారణ చేపట్టి, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బతుకునిస్తుందని బడికిపోతే అదే చావుకొస్తుందని, విద్యార్థుల వరుస మరణాలపై ప్రభుత్వానికి చీమంతైనా పట్టింపు లేకపోవడం బాధాకరమని బీఎస్పీ నేతలు అన్నారు.
హయత్ నగర్ లో నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేసి అనుమతి లేకుండా అక్రమంగా నడిపిస్తున్న కార్పొరేట్ యజమాన్యాలు నారాయణ చైతన్య విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు.