నిర్దేశం, హైదరాబాద్: నిరుద్యోగుల నిరసన నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సోమవారం ఉదయం తార్నాకలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుని పోలీసులు ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి అరెస్టులు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల నిరసనపై గులాబీ పార్టీ ఎక్కువ ఉత్సాహం చూపిస్తోంది. విద్యార్థులతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే బీఆర్ఎస్వీని పోలీసులు ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, అక్రమ అరెస్టులతో నిరుద్యోగ ఉద్యమాన్ని ఆపలేరని అరెస్ట్ అనంతరం తుంగ బాలు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ, గ్రూప్ 1,2,3,4 అభ్యర్థులకు నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు.