నిర్దేశం, హైదరాబాద్: భట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ వట్టి బడ్జెట్ అని బీఆర్ఎస్వీ నాయకులు తుంగబాలు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ఆకాశం.. అమలు చూస్తే పాతాళం అన్నట్లు బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణలోని రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీ, నిరుద్యోగులను మొత్తానికే మోసం చేసిందని విమర్శించారు. పాలనలోకి వస్తారో లేదో అనుకున్న కాంగ్రెస్ కు రాష్ట్రాన్ని అభివృద్ది లోకి తీసుకువచ్చే ప్రణాళికలు ఏమి ఆశిస్తామని ఎద్దేవా చేశారు.
రుణాలు ఇచ్చేదాన్ని కూడా ఆర్థిక మంత్రి భట్టి వత్తి వత్తి పలుకుతుంటే కాంగ్రెస్ తెలివికి కూడా బడ్జెట్ కేటాయించుకుంటే బాగుండని తుంగ బాలు చమత్కరించారు. ఈ బడ్జెట్ విద్యా రంగానికి ఉత్త చెయ్యి అన్ని రంగాలకు మొండి చెయ్యి అన్నట్లున్నదని, మొత్తం మీద బడ్జెట్ అంతా అంకెల గారడి సంఖ్యల పేరడీ మాయమాటల సందడిలా ఉందని తుంగ బాలు తెలిపారు.