తెలంగాణ లో మహిళలపై
జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్రపతి కి ఫిర్యాదు
: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల
హైదరాబాద్ ఫిబ్రవరి 21: తెలంగాణ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై త్వరలో రాష్ట్రపతి కి ఫిర్యాదు చేస్తామన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. తనకు, తన పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమెల్యేలు, మంత్రులపై విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలపై తాను మాట్లాడుతున్నాను కాబట్టే ఇవన్నీ చేస్తున్నారని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ గవర్నర్ కు ఫిర్యాదు చేశానని, దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ లకు దమ్ము ఉంటె సీఎం కేసీఅర్ పైపోరాటం చేయాలన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో తెలంగాణ ముందుందని అన్నారు. పాదయాత్ర బ్రేక్‌పై ఇవాళ కోర్టుకు వెళ్ళామని, మళ్ళీ తిరిగి వరంగల్ జిల్లాలోనే పాదయాత్ర ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాగా నటుడు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు మోకిలోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు అక్కడ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తో జరిగిన సంభాషణపై సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు.