Take a fresh look at your lifestyle.

‘బండి సంజయ్’’ హోలీ ధూంధాం మోటారు‘బండి’ఎక్కి.. గల్లీగల్లీ తిరుగుతూ..

0 14

‘బండి సంజయ్’’ హోలీ ధూంధాం
మోటారు‘బండి’ఎక్కి.. గల్లీగల్లీ తిరుగుతూ..

ఎంపీ బండి సంజయ్ ఏది చేసినా తీన్మార్ స్టైలే.. ఇగో హాలి పండుగను కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు.
చిన్నారులతో ఆడాడు.. పెద్దలకు రంగులు పూసాడు.. బైక్ పై యూత్ తో కలియ తిరిగారు..
హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనంపై గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కన్పించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఇక చిన్నారులు, స్కూల్ విద్యార్థులో హులీ వేడుకల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking