ర్యాకల్ ఎల్లమ్మ జాతరలో
పాల్గొన్న జనవాడే సంగప్ప
నారాయణఖేడ్, ఏప్రిల్ 20 : ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవరి సంగప్ప అభిలాషించారు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్ లో జరుగుతున్న ఎల్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా నాగయ్య చారి నిర్వహించిన ఎడ్లబండ్ల ఊరేగింపులో సంగప్ప పాల్గొన్నారు.
అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా మహిమాన్విత దేవాలయం అయిన ర్యాకల్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని సంగప్ప అన్నారు. వేలమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎల్లమ్మ సేవలో తరిస్తారని ఆయన చెప్పారు.
బిజెపి అధికారంలోకి రాగానే ఎల్లమ్మ గుడికి మంచి రోడ్డు వేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు సాయిరాం, సంజు పాటిల్, పట్నం మాణిక్, సగణాకర్, సాయేందర్, సాయి సాగర్, దర్జీ అశోక్, ప్రభాకర్ గౌడ్, రాములు, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.