అన్నవరం సత్యనారాయణ స్వామి మూల విరాట్‌కు వజ్రకిరీటం సిద్ధమైంది.
పెద్దాపురానికి చెందిన పారిశ్రామిక వేత్త, శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన శ్రీమట్టే సత్య ప్రసాద్ దంపతులు దీన్ని తయారు చేయించారు.
682.230 గ్రాముల బంగారంతో రూపొందించారు.
కిరీటానికి సుమారు 98 శాతం వజ్రాలు పొదిగారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా దీనిని స్వామి వారి దేవస్థానానికి అందచేస్తున్నారు.