అమ్రపాలి సుఖాన్ని పంచింది.. వివక్షకు గురైంది..
- ఓ వేశ్య ఆవేదన
మంచం మీద లేని కులం,
కంచం మీద ఎందుకు మానవ?
మన వాళ్ళు పక్కనే ఉండాలి,
పక్కలో మాత్రం ఎవ్వరైనా ఉండాలా?
మేము డబ్బులు తీస్కొని మీకు సుఖాన్ని ఇస్తున్నాం,
మీరు ఓటుకు డబ్బులు తీస్కొని
రాజకీయ రాబందులకు సుఖాన్ని ఇస్తున్నారు.
మేము మా జీవితం కోసం అమ్ముడు పోతున్నాము,
మీరు మీ జీవితాన్ని అమ్ముకుంటున్నారు.
మేము పొట్ట కూటి కోసం అమ్ముడు పోతున్నాం,
మీరు నోటు కోసం అమ్ముడు పోతున్నారు.
మమ్మల్ని మీరు వ్యభిచారులు అంటారు,
మరి మిమ్మల్ని మీరు ఏమని సంబోధిస్తారు?
నోటు మా జీవితానికి ఆధారం,
అదే నోటు మీ జీవితానికి అంధకారం.
నోటు కోసం ఓటుని అమ్ముకున్న మీరు
నీతులు చెప్పడం ఏంటో మరి….???
—
కుండ శేఖర్ తన ఫేస్ బుక్ లో రాసుకున్న ఈ కవిత తాజా రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యానికి తిలోదాకలిచ్చిన ఓటును అమ్ముకునే ప్రజలను వేశ్యకంటే హీనంగా కవి పేర్కొన్న తీరు బాగుంది. ‘‘ ఓ వేశ్య ఆవేదన’’ శీర్శికతో రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సమాజాన్ని నిలదీసిన వేశ్య
నిజ జీవితంలో అమ్రపాలి అనే వేశ్య ఈ సమాజాన్ని ఇలాగే నిలదీసిందని చరిత్ర చెబుతుంది. ఆ వేశ్య అమ్రపాలి తమ వృత్తి గురించి సమాజాన్ని నిలదీస్తోంది. మంచం మీద లేని వివక్ష కంచం కాడా ఎందుకుంది అని ప్రశ్నిస్తోంది. నిజమే కదా.. చీకటి వేళ వేశ్య వద్దకు వెళ్లి శారీరక సుఖం పొందే మగాళ్లు అదే వేశ్య బయట కనిపిస్తే అసహించుకుంటారు. సుఖంలో అందరూ సమానమే.. ఉత్పత్తిలో.. దేశ సంపదలో వివక్ష లేనప్పుడు సుఖాన్ని ఇచ్చే వేశ్యపై వివక్ష ఎందుకు అంటూ నిలదీస్తోంది అమ్రపాలి.
బుద్ధం శరణం గచ్ఛామి..
బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఇది బౌద్ధ సంప్రదాయాలలో ప్రసిద్ధి చెందిన శ్లోకం. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో వివక్షకు, అవమానాలకు గురైన అమ్రపాలి అనే వేశ్య సమానత్వంతో చూసే బౌద్ద సంఘంలో చేరింది. ఆ సంఘంలో చేరడానికి ముందు గౌతమ బుద్దుడి బోధనలు తెలుచుకుంది. ఆ తరువాత గౌతమ బుద్దుడి వద్దకు వెళ్లింది వేశ్య అమ్రపాలి. అతనే స్వయంగా ఆమెను బౌద్ద సంఘంలో చేర్చుకున్నాడనేది చరిత్ర.
ఓటును అమ్ముకునే వాళ్లు వేశ్యలే..
మేము డబ్బులు తీసుకుని మీకు సుఖాన్ని ఇస్తున్నాం.. మీరు నోటుకు ఓటును అమ్మి రాజకీయ రాబందులకు సుఖాన్ని ఇస్తున్నారు. మీకు మాకు తేడా ఏమిటని ఓ వేశ్య నిలదీస్తోంది. ఓటును అమ్ముకునే ప్రజలు కూడా వేశ్యలకంటే హీనం అంటూ ఆ కవితలో రచయిత కుండ శేఖర్ ప్రశ్నిస్తారు.
మేము మా జీవితం కోసం అమ్ముడుపోతున్నాము. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మీరు నోటు కోసం ఓటు అమ్ముతున్నారు. మేము బతుకడానికి మా శరీరాలు అమ్ముతున్నాం.. అయినా.. మీరు గౌరవంగా బతుకుతూ మేము వివక్షకు ఎందుకు గురి కావాలని ఓటును అమ్ముకునే ప్రజలను సైతం ప్రశ్నిస్తోంది ఆ వేశ్య.