Take a fresh look at your lifestyle.

‘అఖండ’ ఫస్టు డే నైజామ్ వసూళ్లు!

0 55

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైంది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. వసూళ్ల పరంగాను దూసుకుపోతోంది.

తొలి రోజున నైజామ్ వరకూ ఈ సినిమా 4.37 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి షేర్ రావడం గొప్ప విషయంగానే చెప్పుకుంటున్నారు. తొలి ఆటతోనే హిట్ టాక్ రావడం వలన, ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ, ఇది తెలుగు సినిమా విజయం అని చెప్పారు. రెండు సార్లు కరోనా ప్రభావాన్ని దాటుకుంటూ పడిన కష్టానికి ఫలితం లభించిందని అన్నారు. ఇందుకు కారణమైన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి బాలకృష్ణ – బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడటం, అభిమానులను ఖుషీ చేసే విషయం.
Tags: Balakrishna, Pragya Jaiswal, Jagapathi Babu, Srikanth, Akhanda Movie

Leave A Reply

Your email address will not be published.

Breaking