భారతదేశంలో మహిళలకు సముచిత గౌరవం

భారతదేశంలో మహిళలకు సముచిత గౌరవం
 – జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి

విజయవాడ, నిర్దేశం
భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలకు గౌరవం, అవకాశాలు కల్పించబడుతున్నాయని, అన్ని రంగాల్లోనూ వారు ప్రగతి సాధిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి పేర్కొన్నారు.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయప్రద ఫౌండేషన్ విజయవాడలో “మహిళా శక్తి సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించింది. అమరావతి రోటరీ క్లబ్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ భారతి మాట్లాడుతూ, జయప్రద ఫౌండేషన్ గ్రామాలను దత్తత తీసుకుని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అమూల్యమైనవని ప్రశంసించారు.
2018లో జయప్రద ఫౌండేషన్ వత్సవాయి
జిల్లాలోని లింగాల, పోచవరం, గంగవెల్లి గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతూ, పేద పిల్లలకు స్కాలర్షిప్లు, విద్యా సహాయం అందిస్తోందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి బోన్సాయ్ సొసైటీ అధ్యక్షురాలు  అమృత కుమార్ మాట్లాడుతూ, ఆడపిల్లలకు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు స్కాలర్షిప్ల తో పాటు మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లు నిర్వహించి శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేయడం ఆదర్శ దాయకం అని పేర్కొన్నారు.
మహిళలకు సాధికారిత కోసం స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తూ, కుట్టు మిషన్ల పంపిణీ, మహిళలకు ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, అవసరమైన వారికి ఉచిత మందులు మరియు శస్త్రచికిత్సలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు గద్దె అనురాధ, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్.
విద్యార్థులకు పరిశుభ్రమైన తాగు నీరు అందించాలనే లక్ష్యంతో, కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను జయప్రద ఫౌండేషన్ ఏర్పాటు చేయటం అభినందననీయం అన్నారు ఉపద్రష్ట అరుణశ్రీ, రాష్ట్ర ఇంచార్జి, సంస్కృత సంస్కృత భారతి బాలకేంద్ర.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్దన్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అలాగే డాక్టర్ అక్కినేని మణి, అక్కినేని హాస్పిటల్స్; విజయలక్ష్మి, మాజీ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కలశాల; విమల చిగురుపాటి, సుదీక్షణ్ ఫౌండేషన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »