పోసాని తర్వాత లిస్టులో ఉన్నది శ్రీ రెడ్డి?
విజయవాడ, నిర్దేశం:
సినీ నటుడు, దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టుతో ఏపీ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పోసాని బూతులతో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద కూటమి పార్టీల అభిమానులు పలు కేసులు పెట్టారు. వాటి ఆధారంగా అరెస్టు జరిగింది. అయితే, ఇప్పుడు పోసాని అరెస్టు తర్వాత టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.బూతులకు మూల్యం చెల్లించక తప్పదా?పోసాని అరెస్టు తర్వాత ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాలలో నటి శ్రీ రెడ్డి పేరు బలంగా వినపడుతోంది. ఆవిడ చేసిన సినిమాలు తక్కువ. అంతకు ముందు యాంకరింగ్ చేశారు. టీవీ షోలో న్యూస్ రీడర్ కింద పని చేశారు. అప్పట్లో ఆవిడ పాపులర్ కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు ఎప్పుడు అయితే నగ్న ప్రదర్శన చేశారో ఆ తరువాత ఆవిడ పాపులర్ అయ్యారు. అప్పుడు కూడా అవకాశాలు రాలేదు.
కానీ, ఎప్పుడు అయితే వైసిపి టర్న్ తీసుకున్నారో అప్పటి నుంచి శ్రీ రెడ్డి వార్తల్లో వ్యక్తి అయ్యారు.తనను తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా శ్రీరెడ్డి పేర్కొంది. వైసిపి పార్టీకి మద్దతుగా, ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ… ఆ పార్టీ ప్రత్యర్థుల మీద బూతులతో శ్రీ రెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ నారాను అయితే పప్పు అని సంబోధించిన వీడియోలు కోకోల్లలు. పవన్ కళ్యాణ్ మీద అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నీచమైన కామెంట్లు చేసింది. శ్రీ రెడ్డి మీద తెలుగుదేశం జనసేన పార్టీ క్యాడర్ నుంచి నాయకులు వరకు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని తర్వాత లిస్టులో ఉన్నది ఆవిడ పేరేనని, ఆమె అరెస్టు కావడం కన్ఫర్మ్ అని రాజకీయ వర్గాలలో వినబడుతోందిపోసాని న్యాయవాది సైతం అరెస్ట్ తీరు సరికాదని చెబుతున్నారు తప్ప… అరెస్ట్ అక్రమం అని చెప్పడం లేదు. వైసీపీ సానుభూతిపరుల చెవిలో ఆ ముక్క పడిందో? లేదో? పోసాని గానీ, శ్రీ రెడ్డి గానీ మాట్లాడిన మాటలను వాళ్ళ తరఫు వాదించే న్యాయవాదులు సైతం వెనకేసుకు రాలేని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత… గతంలో గీత దాటి, హద్దు మీరి ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా రాయలేని భాషలో బూతులతో విరుచుకుపడిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తారని సంకేతాలు బలంగా వెళ్లాలి. దాంతో శ్రీ రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, లోకేష్ – ఇద్దరికీ క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేశారు. అయినా గతంలో మాట్లాడిన బూతులకు, వ్యక్తిగత దూషణలకు మూల్యం చెల్లించక తప్పదనే సమాచారం అందుతోంది.పోసాని అరెస్టు తర్వాత కూటమి ప్రభుత్వం మీద వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణంగా వ్యవహరిస్తుందని పేర్కొంటున్నారు. వాళ్లకు ధీటుగా కూటమి ప్రభుత్వ సానుభూతిపరులు పోసాని గతంలో మాట్లాడిన బూతు పురాణాన్ని బయటకు తీశారు. శ్రీ రెడ్డి అరెస్టు తర్వాత కూడా ఆవిడ పట్ల సానుభూతి కంటే వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.