మావోయిస్టు పార్టీకి మరో షాక్
వరంగల్, నిర్దేశం:
ఓవైపు ఎన్‌కౌంటర్‌లు… మరోవైపు లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని వెంటాడుతున్నాయి. మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు కొసా ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా ఆలియాస్ జిన్ని వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యం నుంచే చైతన్య నాట్య మండలి పని చేశారు. అలా మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారయణ రెడ్డికి ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమించినట్లు సీపీ చెప్పారు. 2021 సంవత్సరంలో కేంద్ర మవోయిస్టు నాయకత్వం కేషాను ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమించడం జరిగింది. 2024 ఏప్రిల్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయన రెడ్డి ఆలియాస్ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.పార్టీలో పనిచేసిన సమయంలో కొహిలబేడా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో కల్సి పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్ అధికారి మరణించగా మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అబుజ్‌మడ్‌లో ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మరణించాడు. ఈ రెండు ఘటనల్లో వంజెం కేషా నిందితురాలని వరంగల్ పోలీస్ కమిషనర్ చెప్పారు.వంజెం కేషాపై 4లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితులుకావడంతపాటు, మావోయిస్టులు సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనరేట్ తెలిపారు.