హైడ్రాకు హైకోర్టు వార్నింగ్

హైడ్రాకు హైకోర్టు వార్నింగ్

హైదరాబాద్, ఫిబ్రవరి 21
తెలంగాణలో హైడ్రా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో కొంత పాజిటివ్‌ ఫలితాలు ఉంటే మరికొంత నెగిటివ్ కాంప్లికేషన్స్‌ కూడా వస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ఇదే విషయంపై హైడ్రాను నిలదీసింది. కొందరు వ్యక్తిగత కక్షతో హైడ్రాను సంప్రదించి తమకు అనుకూలమైన పనులు చేయించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెబతున్నా పట్టించుకోకుండా హైడ్రా ఇష్టానుసారంగా పని చేస్తోందని తెలంగాణ హైకోర్టు మరోసారి ఫైర్ అయింది. ఇకపై జీవో 99కు విరుద్దంగా వెళ్తే మాత్రం హైడ్రాను రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. డాక్యుమెంట్స్ చూసి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆ హక్కు హైడ్రాకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. వివరాలు పరిశీలించకుండా తన షెడ్‌ను కూల్చేశారని ఆయన వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేశారు. ఈ విచారణకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరయ్యారు.   గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదుతోనే హైడ్రా చర్యలు తీసుకుందని బాధితుడు తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నిర్మాణాలకు 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. బెదిరించి పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతులు తీసుకున్నారని కోర్టుకు హైడ్రా వివరించింది. 2025లో వాటిని రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపారు హైడ్రా న్యాయవాది. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్‌ కేసు’ సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు కూల్చివేయవచ్చని పేర్కొందని గుర్తు చేశారు. హైడ్రా న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి సీరియసస్ అయ్యారు. పరిష్కరిస్తున్న కొద్దీ హైడ్రపై పిటిషన్లు వస్తూనే ఉన్నాయని అన్నారు. బెదిరించి అనుమతులు తీసుకున్నట్టు ఎలా చెబుతారని నిలదీశారు. అనుమతులు ఇచ్చిన తర్వాత రద్దు చేసే వరకు రెండేళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన వాళ్లు గతంలో ఎందుకు చేయలేదని అనుమానం వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చే వరకు వాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పార్కు స్థలం అని నిర్ణయించాల్సింది ఎవరని, సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన విషయాన్ని మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించింది. అ స్థలంలో నిర్మాణాలు చేపట్టే వ్యక్తిని కబ్జాదారుగా అనడానికి రైట్ ఎక్కడుందన్నారు. ప్రస్తుతానికి ఆ స్థలంలో యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించి కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించింది. కేసు విచారణను మార్చి 5కి వాయిదా వేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »