ఖమ్మంలో చర్చి ఫాదర్ 100 కోట్ల స్కామ్
ఖమ్మం, నిర్దేశం:
ఖమ్మంలోని ఓ చర్చి పాస్టర్ బాబు జంగాల ప్రకాష్ సాయంతో ప్రజలకు దగ్గర అయ్యారు. ఆయన సాయంతో పలు ప్రాంతాలకు చెందిన క్రిస్టియన్‌లను మెటా ప్లస్‌లో భాగస్వాములు చేశారు. కంపెనీ నిర్వాహకుడిగా చెప్పుకున్న నవీన్‌కు పాస్టర్ బాబు జంగాల ప్రకాష్ సమీప బంధువు కావడంతో వాళ్ల పని సులువు అయింది. ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రోజూ 1 పర్సంట్ ప్రాఫిట్ వస్తుందని ప్రచారం చేశారు. నెలలో 20 రోజులు అమౌంట్ వస్తుందని నమ్మించారు. 1లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 10 నెలల్లో డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పారు.కంటిన్యూగా పెట్టుబడి పెట్టిన వారికి దుబాయ్, గోవా ట్రిప్పులకు తీసుకెళ్తామని ఆఫర్లు చేశారు. దీంతో స్థానికులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్ చేయడమే తప్పా.. ఇన్ కమ్ రావడంలో లేదని గ్రహించారు. దీనిపై మెటాప్లస్ నిర్వాహకులను ప్రశ్నించారు. క్వశ్చన్ చేస్తే రౌడీలతో బెదిరించారని చెబుతున్నారు బాధితులు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను బాధితులు ఆశ్రయించగా మెటాప్లస్ నిర్వాహకుల మోసం బయటపడింది. ఏకంగా 100 కోట్ల రూపాయలు దోచేశారని తేలింది.
ఇదిలా ఉంటే.. కడప జిల్లా డ్వాక్రా గ్రూపులో ఆర్ పీ చేతివాటం చూపించారు. బినామీ పేర్లతో 10 లక్షల రూపాయలు దోపిడీ చేసినట్లు సమాచారం. న్యాయం కోసం ఎమ్మెల్యేని కలిశారు బాధితులు. తమ పొదుపు డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల ముందే డ్వాక్రా సభ్యులను దుర్భాషలాడుతూ దాడికి దిగాడు ఆర్.పీ. వన్ టౌన్ పీఎస్ లో ఆర్ పీ పై ఫిర్యాదు చేశారు డ్వాక్రా మహిళలు.