‘రకుల్ ప్రీత్ సింగ్’ న్యూఢిల్లీలోని పంజాబీ సిక్కు కుటుంబంలో 1990 అక్టోబరు 10న జన్మించారు, ఈమె తండ్రి ‘కుల్విందర్ సింగ్’ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేస్తారు.
రకుల్ ‘గిల్లి’ అనే కన్నడ ఫిలింతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ‘కెరటం’ అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు.. ధృవ, జయ జానకి నాయక, నాన్నకు ప్రేమతో వంటి తెలుగు సినిమాలతో మంచి పేరును సంపాదించుకొని టాప్ హీరోయిన్ గా ఎదిగారు. కెరీర్ మంచి పీక్ లో ఉండగానే నిర్మాత ‘జాకీ భగ్నానీ’ వివాహమాడారు.
వ్యాయామం చేసే సమయంలో 80 కేజీల బరువును ఎత్తేటపుడు ఆమెకు వెన్నుకు గాయమై దాదాపు రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నారు.. ఈ మధ్యనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ లలో మాట్లాడుతున్నారు. రకుల్ ఎపుడు తన సోషల్ మీడియాలలో జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. రెగ్యులర్ గా వర్కౌట్ చేయండి అని ఫాలోవర్స్ కి చెబుతూ ఉంటుంది.
అన్షుల్ శర్మ డైరెక్షన్ లో అజయ్ దేవగణ్, టబు ప్రధాన పాత్రల్లో ‘దే దే ప్యార్ దే 2’ అనే రొమాంటిక్ కామెడీ ఫిలిం లో ‘రకుల్ ప్రీత్ సింగ్’ హీరోయిన్ గా నటిస్తున్నారు, 2025వ సంవత్సరములో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు బ్లూ ట్రౌజర్ డ్రెస్లో ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.