నిర్దేశం, న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ ఘోర పరాజయంపై ఆలోచనలో పడింది. ఇదిలా ఉంటే సీఎస్డీఎస్కి సంబంధించిన షాకింగ్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. సీఎస్డీఎస్ సర్వే ప్రకారం ఓబీసీ ఓటర్లు అత్యధికంగా బీజేపీకి ఓటు వేశారు. కాగా జాట్లు, జాతవ్‌లు, ముస్లింలు కాంగ్రెస్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. దళితుల ఓట్లు అన్ని పార్టీలకు చీలిపోయాయి.
జాట్లలో 28 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 53 శాతం మంది కాంగ్రెస్‌ను విశ్వసించారు. 19 శాతం మంది ఇతర పార్టీలకు అనుకూలంగా ఓటు వేశారు. ఇక, 51 శాతం మంది బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు, 31 శాతం మంది బీజేపీకి, 2 శాతం మంది బీఎస్పీ-ఐఎన్ఎల్డీకి, 16 శాతం మంది ఇతరులకు ఓటు వేశారు.
పంజాబీ ఖత్రీ బీజేపీకి ఓటు వేశారు
సర్వే ప్రకారం 68 శాతం పంజాబీ ఖత్రీలు బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. 18 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేశారు. 14 శాతం ఓట్లు ఇతరులకు పోలయ్యాయి. ఇతర అగ్రవర్ణ ఓటర్లలో 59 శాతం మంది బీజేపీకి, 22 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 19 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు.
44 శాతం మంది గుర్జర్లు కాంగ్రెస్‌కు, 37 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 19 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు. యాదవ ఓటర్లలో 62 శాతం మంది బీజేపీకి, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 13 శాతం మంది ఇతరులకు ఓటు వేశారు. ఇతర ఓబీసీలలో 47 శాతం మంది బీజేపీకి, 32 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 21 శాతం మంది ఇతర పార్టీలపై విశ్వాసం వ్యక్తం చేశారు.
జాతవ్ ఓటర్లు ఎటువైపు?
సర్వే ప్రకారం 50 శాతం జాతవ్‌లు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 35 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 15 శాతం మంది ఇతర పార్టీలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఆసక్తికరంగా, వారిలో 6 శాతం మంది మాత్రమే బీఎస్పీ-ఐఎన్ఎల్డీ కూటమికి ఓటు వేశారు. సాధారణంగా జాతవ్ ఓటర్లు హిందీ హార్ట్‌ల్యాండ్‌లో బీఎస్పీకి ఓటు వేస్తారు. కానీ, బీఎస్పీ లేని ప్రాంతాల్లో వారు కాంగ్రెస్, బీజేపీలను ఎంచుకున్నారు. ఇతర ఎస్సీ వర్గాల్లో 33 శాతం మంది కాంగ్రెస్‌కు, 45 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 22 శాతం మంది ఇతర పార్టీలపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ముస్లిం ఓటర్ల పరిస్థితి
ముస్లిం ఓటర్లలో కూడా చీలిక కనిపించింది. 59 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేశారు. 7 శాతం మంది బీజేపీపై, 34 శాతం మంది ఇతర పార్టీలపై విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 47 శాతం మంది సిక్కులు కాంగ్రెస్‌కు, 21 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. ఇతర పార్టీలపై 32 శాతం నమ్మకం చూపించారు.