కండోమ్‌ వద్దు.. శృంగారం ముద్దు..

కండోమ్‌ వద్దు.. శృంగారం ముద్దు..

– దేశంలో కండోమ్‌లంటే తెలియని జనం ఆరు శాతం..
– ఏటా సగటున 33.07 కోట్ల కండోమ్‌లు సేల్‌..
– అత్యధికంగా కండోమ్‌ల వినియోగిస్తుంది హవేలీ..
– అత్యల్పంగా కండోమ్‌ల వినియోగిస్తుంది కర్ణాటక..
– ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల

(ఈదుల్ల మల్లయ్య)

కండోమ్… ఈ కండోమ్ లేకుండా శృంగారం చేస్తే అన్నీ సమస్యలే.. జోడి దారుడికి ఎయిడ్స్ ఉండోచ్చు.. ఆ ప్రమాదకరమైన ఎయిడ్స్ శృంగారంతో నిన్ను కబళించవచ్చు.. వివాహేతర సంబంధం పెట్టుకుని శృంగారం చేస్తే మహిళలు గర్భం దాల్చవచ్చు. సమాజంలో ఆమెకు చెడ్డ పేరు రావచ్చు.. వ్యభిచారిని వద్దకు వెళ్లితే ఎయిడ్స్ గిప్ట్ గా రావచ్చు.. అవగహన లేకనో.. కండోమ్ వాడితే శృంగారంలో తృప్తి లేదనో భావించి కండోమ్ కు దూరంగా ఉండే జనం ఎక్కువే. ఇగో.. ఆ కండోమ్ ఉపయోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసింది.

Canada Supreme Court: కండోమ్ పెట్టిన చిచ్చు.. కోర్టుకీడ్చిన అమ్మాయి - NTV Telugu

కండోమ్ లేకుండా శృంగారంకు మొగ్గు..

దేశంలో కండోమ్‌ వినియోగించకుండా శృంగారం చేసే ట్రెండ్‌ రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసిన ప్రతిసారి.. దేశంలో కండోమ్ లేకుండా శృంగారం చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది. ఈసారి కూడా అదే మాట చెప్పింది. అంతేగాక ఏయే రాష్ట్రాల్లో కండోమ్‌ల వినియోగం ఎక్కువగా ఉందో కూడా వెల్లడించింది. కండోమ్‌ల వాడకంపై ఆరోగ్య శాఖ నిరంతరం అవగాహన కల్పిస్తున్నది.

Condom News in Telugu | Latest Condom Telugu News Updates, Videos, Photos - Oneindia Telugu

కండోమ్ హవేలిలో ఎక్కువ.. కర్ణాటకలో తక్కువ..

ప్రస్తుతం ఏయే రాష్ట్రాలు కండోమ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నాయనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ నిర్వహించిన ఈ సర్వేలో.. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో కండోమ్‌ల వినియోగం అత్యధికంగా ఉంది. కేవలం రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ కండోమ్‌ల వినియోగంలో తొలి స్థానంలో ఉన్నది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం దాద్రా – నగర్‌ హవేలి తొలి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి. దాద్రా – నగర్ హవేలీలో ప్రతి 10 వేల జంటలలో 993 జంటలు శృంగార సమయంలో కండోమ్‌లను వినియోగిస్తున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎంత శాతం కండోమ్ వినియోగం..

ఏపీలో ప్రతి 10 వేల జంటల్లో 978 జంటలు కండోమ్‌లు వాడుతున్నాయి. ఇదిలావుంటే కర్ణాటకలో మాత్రం ప్రతి 10 వేల జంటల్లో కేవలం 307 జంటలు మాత్రమే కండోమ్‌లను వినియోగిస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రతి 10 వేల జంటల్లో 960 జంటలు, పంజాబ్‌లో ప్రతి 10 వేల జంటల్లో 895 జంటలు, చండీగఢ్‌లో ప్రతి 10 వేల జంటల్లో 822 జంటలు, హర్యానాలో ప్రతి 10 వేల జంటల్లో 685 జంటలు శృంగారం కోసం కండోమ్‌లు వాడుతున్నారు.ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి 10 వేల జంటల్లో 567 జంటలు, రాజస్థాన్‌లో ప్రతి 10 వేల జంటల్లో 514 జంటలు, గుజరాత్‌లో ప్రతి 10 వేల జంటల్లో 430 జంటలు కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. అదేవిధంగా దేశంలో కండోమ్‌ల గురించి తెలియని వారు ఆరు శాతం మంది ఉన్నారని తాజా నివేదిక పేర్కొంది. అంటే దేశంలో 94 శాతం మందికి మాత్రమే కండోమ్‌ గురించి తెలుసు. దేశంలో ఏటా సగటున 33.07 కోట్ల కండోమ్‌లు సేల్‌ అవుతున్నాయని అధ్యయనం తెలిపింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!