నిర్దేశం, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి చేసిన కొన్ని ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా ప్రతి ఏటా బడ్జెట్ లో భారీగా పన్నులు విధించే వస్తువులపై ఈసారి పన్నులు వేయకుండా రాయితీలు కల్పించడం గమనార్హం. బడ్జెట్ అంటే బంగారంపై పన్నులు వేయడమే, మొబైల్ ధరలపై మోత మోగించడమే. అలాంటిది.. ఈసారి వీటిపై భారీగా పన్నులు తగ్గించారు. దీంతో వీటి విలువ బాగానే తగ్గుతుంది. ఇక కొన్నింటిపై అదనపు పన్నులు విధించారు. అవేవో చూద్దాం.
ధరలు తగ్గేవి:
➤మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
➤బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి, ప్లాటినంపై 6.4%కి తగ్గింపు
➤ క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
➤ ఫెర్రో నికిల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➤ చౌకగా లభించనున్న లెదర్ వస్తువులు, సీఫుడ్
➤ సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదన
➤ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గింపు
➤ 25 కీలక ఖనిజాలపై కూడా కస్టమ్స్ సుంకం మినహాయింపు
➤ రొయ్యల, చేపల మేతపై, బ్రూడ్ స్టాక్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గింపు
ధరలు పెరిగేవి:
➤ టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 15%కి పెంపు
➤ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ 25 శాతం పెంపు
➤ అమ్మోనియం నైట్రేట్పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం పెంపు
➤ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై 25 శాతం కస్టమ్స్ సుంకం పెంపు