- వైసీపీ కంటే ఎక్కువ స్థానాలతో పెరిగిన ఆత్మస్థైర్యం
పాతవాటికి వడ్డీ లెక్కపెట్టి తిరిగిస్తున్న జనసైనిక్స్
నిర్దేశం, విజయవాడ: చాలా కాలంగా వైసీపీ-జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వారి అభిమానులు, కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అయితే ఇంతకు ముందు జనసేన కార్యకర్తల మీద వైసీపీ వాళ్ల ఆధిపత్యం ఉండేది. దీనికి ప్రధాన కారణం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోవడం, భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలో ఉండడం. ఈ రాజకీయ యుద్ధం చాలాసార్లు పరిధులు దాటి కుటుంబాల వరకు వెళ్లింది. పవన్ పెళ్లి గురించి స్వయంగా జగన్ మోహాన్ రెడ్డి బహిరంగ సభల్లో కామెంట్లు చేసే వరకు వచ్చింది. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జగన్ చేశారు. ఇక జనసేన నుంచి కూడా అదే తరహాలో రిప్లైలు వచ్చినప్పటికీ.. అధికార అలంకారం వైసీపీ పెద్ద బలంగా మారిపోయింది.
ఒక్క సీటు కూడా గెలవలేదని, గెలవలేడంటూ పవన్ మీద వైసీపీ వాళ్లు తరుచూ విమర్శలు గుప్పించేవారు. ఇవే కాకుండా అనేక విషయాల్లో పవన్ మీద వ్యక్తిగత కామెంట్స్, ట్రోల్స్ అనేకం జరిగేవి. పాపం.. ఆ సమయంలో జనసైనిక్స్ కి తట్టుకోలేని కోపం వచ్చినప్పటికీ ఓడిపోయామనే నిస్సహాత వారిని అడ్డుకునేది. అయితే తాజాగా వైసీపీ అధికారం నుంచి ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం, వైసీపీ కంటే ఎక్కువ స్థానాలను జనసేన గెలుచుకోవడంతో జనసైనిక్స్ కి వంద ఏనుగుల బలం వచ్చినట్టైంది. అంతే, గతంలోని సందర్భాలన్నీ గుర్తు చేస్తూ జగన్ ను, వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు.
Once gelichesaka opponent lite le gelchesam ga anpisthadi ah feeling ae ratledu enti entha try chesina 🙂 pic.twitter.com/AtEIykDz1o
— Pk3Vk – GnanaVarsha (@DigitallyGV) June 5, 2024
Pasupuleti Sandeep Royal JanaSena party office lo receptionist pilla p gadu vadni teeskuni poyi JanaSena nayakudu ani notikochina sollu cheppichina roje sagam close ra mee file @YSRCParty btw vadi handle kanpitledu odiledhe ledhu with all the proofs legal action loading 👍 👍
— Pk3Vk – GnanaVarsha (@DigitallyGV) June 5, 2024
శవాల దగ్గర కూడా నవ్వే వాడిని చివరికి ఏడిపించారు కదరా @JanaSenaParty @JaiTDP @BJP4Andhra pic.twitter.com/x3bUXe5J55
— Trend PSPK (@TrendPSPK) June 5, 2024