2024 ఎన్నికల ఫలితాల్లో ఎన్నో విశేషాలు

*పార్టీ స్థాపించిన పదేళ్లకు జనసేన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన గెలుపొందడం విశేషం.
*బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి.
*151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయింది. వైసీపీకి ఇది చారిత్రాత్మక పరాజయం.
*తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాలే గెలుపొందిన బీజేపీ 8 లోక్ సభ స్థానాలను గెలుపొందడం విశేషం.
*రెండుసార్లు పూర్తి ప్రభుత్వాన్ని నడిపి మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనతను బీజేపీ సాధించింది. గతంలో నెహ్రూ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా వరుసగా నాలుగు సార్లు గెలిచింది.
*అమేథీ స్థానంలో రాహుల్ గాంధీని 2019లో ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ లాల్ చేతిలో పరాజయం పాలయ్యారు.
*కేరళలో బీజేపీ ఎట్టకేలకు ఖాతా తెరించింది. త్రిస్సూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి వీఎస్ సునిల్ కుమార్ పై ఆయన విజయం సాధించారు.
*యూపీలో బీజేపీని దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్ వాదీ పార్టీ అవతరించింది. ఓట్ల విషయంలో బీజేపీ ముందున్నప్పటికీ.. సీట్ల విషయంలో సైకిల్ పార్టీ మ్యాజిక్ చేసింది.
*సంకీర్ణ ప్రభుత్వాల యుగాన్ని అధిగమించి రెండుసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మూడోసారి 243 సీట్లు సాధించడం గమనార్హం.
*చెన్నై సౌత్ లో తమిలి సై కి షాక్. ఢీఎంకే అభ్యర్ధి చేతిలో ఓటమి. రెండోసారి ఓటమి పాలైన తెలంగాణ మాజీ గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్.
*ఈ ఎన్నికల్లో అమిత్ షా దేశంలోనే అధిక మెజార్టీతో గెలిచారు. అమిత్ షాకు 7 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది.
*పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (వయనాడ్, రాయిబరేలి) రాహుల్ గాంధీ గెలిచారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!