ఆమె వేశ్య– అతడు విటుడు
బాధ్యత బరువైన బతుకు ఆమెది
వైభోగం విలాసం అతని నైజం
ఆమె వివస్త్రై
పట్టే బొక్కలు పరుండ బెట్టి
రెండు తొడలు చాచి
దేహాన్ని వ్యాపారంగా మలిచిన దీనురాలు.
అతడు తల్లి పాలను జుర్రినట్టు
ఆమె చనువాలను జుర్రుతూ
సుఖ ప్రాప్తి అనుభవిస్తున్నాడు..
ఆమెను విచక్షణ రహితంగా
అతడి శరీర కామ క్రీడను తట్టుకోలేక అరుస్తుంటే
అతడికి ఎంత
వైభోగ సుఖమో…
అతడి జన్మకు కారణమైన
ముఖ ద్వారం రక్తం కరుస్తుంటే అతనికి ఎంత పైశాచిక ఆనందమో…
ఎందుకో ఏమో
ఆమె తిరగబడితే లంజే..
నీకెందుకే అనే వారే ఉన్నారు గాని
నేనున్నాను నీకు నాన్నగా, అన్నగా, తమ్మునిగా, మామగా, భర్తగా, కొడుకుగా… అనీ
ఎవ్వరు ఆమెకు దైర్యం ఇచ్చిన. పాపన పోలేదు..!
అందుకే ఆమె వేశ్య అయింది
వాడు రాజు అయ్యాడు…!!
– నేనే సురేష్ l