నిందితుడికి సహకరించారని
సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్
నిర్దేశం, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం కేసులో సహకరించారనే ఆరోపణలతో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను డీకొట్టిన విషయం విదితమే.
పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా గతంలో బోధన్ సీఐ గా పని చేసిన ప్రేమ్ కుమార్ నిందితుడు రాహిల్ ఆమీర్ దుబాయ్ పారిపోవడానికి సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
అయితే.. సీఐ ప్రేమ్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే బోధన్ మాజీె ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేసిన విషయం విదితమే.