మద్దికేర మండలం పరిధిలోని పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం రోజున ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభించారు. ప్రారంభించుట కు ముందే దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిపాజిట్లు కట్టినవారు, ప్రజలు, దేవాలయ సిబ్బంది, ఆలయ కమిటీ మెంబర్లు సమక్షంలో నియమ నిబంధనలు చదివి వినిపించారు. డిపాజిట్లు దారు అడిగిన ప్రశ్నలకు సమన్యాయం జరిగే విధంగా చెప్పి వేలం పాటను మొదలుపెట్టారు. వేలంపాట పోటాపోటీగా జరిగింది. చివరికి 5,33,000/- పాట పాడి కురువ ఉరుకుందు అలియాస్ ఎన్ ఎస్ టైలర్ అనే వ్యక్తి టెంకాయలు తమలపాకులు దేవాలయ ప్రాంగణంలో అమ్ముటకు హక్కు పొంది ఉన్నారు, దేవాలయ అభివృద్ధికి దోహదపడుతుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మటమ్ మల్లికార్జున చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కమిటీ మెంబర్లు, డిపాజిట్ గారు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.