సంక్షిప్త వార్తలు… ఇండియా రౌండప్!

తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. తమిళనాడులో దాదాపు 10 నెలల తర్వాత మళ్లీ లాక్ డౌన్ విధించారు.

ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేది లేదని వెల్లడించాడు. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని అన్నాడు. అయితే, క్రికెట్ తో సంబంధం కొనసాగిస్తానని, అయితే అది కోచ్ గానా, లేక సలహాదారుగానా అనేది త్వరలో చెబుతానని వెల్లడించాడు.

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. బేతల సరస్వతి భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు. మండలంలోని రహత్ నగర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఆమెకు ఇటీవలే దూరప్రాంతానికి బదిలీ అయింది. బదిలీపై దూరప్రాంతానికి వెళ్లడం ఇష్టంలేకనే బలవన్మరణం చెందినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు గత కొన్నిరోజులుగా వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షలను ఈ నెల 20 వరకు కొనసాగించనున్నట్టు తెలిపింది.

నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం మ్యూజికల్ నైట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా జరపాలనుకుంటున్నామని, ఇప్పటికే అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. మ్యూజికల్ నైట్ కు అక్కినేని అభిమానులను ఎక్కువమందిని పిలవలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 11న బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!