జిల్లా:జనగామ.జర్నలిస్టు సంతోష్ ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని దేవరుప్పుల మండల ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు పులిగిల్ల సారయ్య తీవ్రంగా ఖండించారు.జనగామ-సూర్యాపేట దేవరుప్పుల రహదారి చౌరస్తాలో ధర్నాలు చేశారు. జర్నలిస్టుల కారణంగానే మీరు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారని.. జర్నలిస్టుల జోలికి వస్తే మీ భవిష్యత్తు కూడా జర్నలిస్టులే నిర్ణయిస్తారని.. అన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉపాధ్యక్షులు దూదిమెట్ల సోమలింగం, ప్రధాన కార్యదర్శి గుండు సుధాకర్,కోశాధికారి భాషిపాక ఎల్లేష్,సహాయ కార్యదర్శి పత్తేపురపు శేఖర్,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.