వెల్దుర్తి మండలం లోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సిఐటియు ఎఐటియుసి మండల నాయకులు రైతన్నలు తలపెట్టిన డిసెంబర్ 8 బంద్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. జరిగే బందులో వెల్దుర్తి మండలంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి రాముడు, ఏఐటియుసి మండల నాయకులు మాధవ స్వామి, సిఐటియు హమాలి యూనియన్ మండల నాయకులు మారన్న, మళ్లీ, పెద్దన్న, సీఐటీయూ మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు శీను, రాజు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు…ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..