కాంగ్రెస్ లో చేరిన జడ్పీ చైర్ పర్సన్
హైదరాబాద్
మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ వంశీచంద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2004 లో అమరచింత నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున జడ్పీటీసీ గా ఎన్నికై జడ్పీ చైర్ పర్సన్ అయ్యారు