జహీరుద్దీన్ అలీ ఖాన్ స్మారక పాత్రికేయ పురస్కారాలు
నిర్దేశం, హైదరాబాద్ :
ఇటీవల సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకుని ముందుకు సాగుతున్న తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ( TUJS ) ముందు అడుగు వేసింది. జర్నలిజంలో ఉన్నత విలువల స్థాపనకై దివంగత సంపాదకులు జహీరుద్దీన్ అలీ ఖాన్ స్మారక పాత్రికేయ పురస్కారాలను ప్రతి ఏటా ఇవ్వాలని నిర్ణయించిందన్నారు తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఎంఎం రహమాన్, ప్రధాన కార్యదర్శి టీ. రమేష్ బాబు తెలిపారు. తొలుత ఈ పురస్కారాలను ప్రింట్ మీడియా నుంచి ప్రారంభిస్తూ తెలుగు, ఉర్దూ భాషల్లో రెండేళ్లలో ప్రచురితమైన మానవీయ కథనాల నుంచి ఎంపిక చేయాలని భావిస్తూ రచనలకు ఆహ్వానం పలుకుతున్నమన్నారు.
మొదటి బహుమతి లక్షా రూపాయలు, రెండవ బహుమతి 50 వేలు, మూడవ బహుమతి 25 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు వివరించారు. దరఖాస్తు చేయాలనుకునే జర్నలిస్టులు 95509 66456 కు కాల్ చేసి వివరాలు తీసుకోవాలన్నారు.