వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాన్ పథకం
నాల్గవ ఏడాదిలో మూడవ విడత నిధులు విడుదల
అమరావతి : అల్లూరి జిల్లాలో వై.ఎస్.ఆర్.రైతు భరోసా – పి.ఎం.కిసాన్ పథకం మూడవ విడత ద్వారా జిల్లాలోని 1,63,009 మంది రైతులకు రూ.34.09,59,500 కోట్లు లబ్ది చేకూరిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వై.ఎస్.ఆర్.రైతు భరోసా – పి.ఎం.కిసాన్ పథకం వరుసగా నాల్గవ ఏడాదిలో మూడవవిడత నిధుల పంపిణీ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కాఫీ హౌస్ సమావేశమందిరంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన రైతు భరోష కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని రైతు భరోష లబ్దిదారుల చెల్లించాల్సిన లబ్ధిని డి.బి.టి విధానంలో మీట నొక్కి రైతుల ఖాతాలకు జమచేసారు. అనంతరం జిల్లాలోని 1,63,009 మంది రైతులకు రూ.34.09,59,500 కోట్లను వారి ఖాతాలోకి జమచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు నమూనా చెక్ ను రైతులకు అందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. విజయ కుమార్, ఎం.వి శ్రీనివాస్, ఎం. శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.