కోరుట్లలో తల్వార్ తో యువకుడు వీరంగం
నిర్దేశం, జగిత్యాల :
జగిత్యాల జిల్లా కోరుట్లలో యువకుడు తల్వార్ తో హల్ చల్ చేశాడు. కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు యువకులపై దాడి చేయగా ఇద్దరు గాయపడ్డారు. దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డం పెట్టి వ్యాపారం చేస్తున్నాడని దుకాణం యజమాని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ పెరిగి కత్తులతో దాడి వరకు వెళ్ళింది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. దాడిలో బార్బర్ షాప్ నిర్వాహకులు రేవంత్, సుమంత్ గాయపడ్డారు. ఇద్దరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. దాడిలో ఓ బైక్ దగ్దమయ్యింది. తల్వార్ తో యువకుడు హల్ చల్ చేసిన విజువల్స్ సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. కత్తితో దాడికి పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ఫానీపూరి బండి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తులో వీరంగం చేసినట్లు భావిస్తున్నారు.